- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఇంట్లో తీవ్ర విషాదం
ప్రముఖ సినీ నిర్మాత దిల్‌రాజు ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దిల్ రాజు తండ్రి శ్యామ్ సుందర్ రెడ్డి(86) కన్నుమూశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సినీ నిర్మాత దిల్‌రాజు ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దిల్ రాజు తండ్రి శ్యామ్ సుందర్ రెడ్డి(86) కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను ఇటీవల ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. దిల్‌రాజు తండ్రి మరణవార్త తెలిసిన సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. శ్యామ్ సుందర్‌రెడ్డికి ముగ్గురు సంతానం. విజయ్ సింహారెడ్డి, నరసింహారెడ్డి, దిల్ రాజు ఉన్నారు. దిల్ రాజు అసలు పేరు వెంకట రమణారెడ్డి. చిన్నతనం నుంచే ఆయనను కుటుంబ సభ్యులంతా రాజు అంటూ పిలుచుకునే వారు. ఆయన స్వస్థలం నిజామాబాద్ జిల్లా కాగా.. పైచదువుల కోసం హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. మొదట డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ ప్రారంభించి.. ఇప్పుడు అగ్ర నిర్మాతగా రాణిస్తున్నారు.
Next Story






