'ఎఫ్3'కి అడ్డుపడుతున్న RRR.. ఫ్రస్ట్రేషన్‌లో మేకర్స్..

by Web Desk |
ఎఫ్3కి అడ్డుపడుతున్న RRR.. ఫ్రస్ట్రేషన్‌లో మేకర్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: మోస్ట్ హిలేరియస్ మూవీగా తెరకెక్కుతున్న సినిమా 'ఎఫ్3'. 'ఎఫ్2'తో అందరినీ కడుపుబ్బా నవ్వించిన అనిల్ మరింత నవ్వించేందుకు 'ఎఫ్3'ని తెరకెక్కించాడు. కానీ ఈ సినిమా విడుదల వాయిదా పడుతూనే ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రిలీజ్ పరంగా మరో సినిమాతో క్లాషెస్ ఉండకూదని మూవీ మేకర్స్ చూస్తున్నారు. అందుకనే ఇప్పటికే సినిమా రిలీజ్‌ను వాయిదా వేశారు. అయితే తాజాగా 'ఎఫ్3' మూవీ ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వస్తుందని ప్రకటించారు.

కానీ కొత్తగా మేకర్స్ మళ్లీ తలనొప్పి పట్టుకుంది. అందుకు కారణంగా దేశవ్యాప్తంగా అందరూ ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ మూవీ మేకర్స్ కూడా పరిస్థితులు చక్కబడితే సినిమా మార్చి 18 లేదా ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు. దీంతో 'ఎఫ్3' మేకర్స్ మళ్లీ రిలీజ్‌పై కసరత్తులు చేయాల్సి వస్తోంది. దీంతో మేకర్స్‌కు 'ఎఫ్3' సినిమా ఫ్రస్ట్రేషన్ తప్పా ఫన్ ఇవ్వడం లేదని ఫ్యాన్స్ అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Next Story