ఉత్కంఠ రేపుతున్న ‘తాలి’ ట్రైలర్.. ట్రాన్స్‌జెండర్ పాత్రలో అదరగొట్టిన సుస్మితా సేన్

by Disha Web Desk 6 |
ఉత్కంఠ రేపుతున్న ‘తాలి’ ట్రైలర్.. ట్రాన్స్‌జెండర్ పాత్రలో అదరగొట్టిన సుస్మితా సేన్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సుస్మితా సేన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్‌సిరీస్ ‘తాలి’. ఇందులో సుస్మితా సేన్ ట్రాన్స్‌జెండర్ పాత్రతో అలరించనుంది. ఈ సిరీస్ ఆగస్టు 15 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ ‘జియో సినిమాలో’ హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ, తమిళం భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ సిరీస్ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది.

తాజాగా, ‘తాలి’ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో శ్రీ గౌరీ సావంత్ పాత్రలో సుస్మితా సేన్ కనిపించింది. దేశంలో ట్రాన్స్‌జెండర్స్ హక్కుల కోసం ఆమె ఎలా పోరాడిందో ఈ సిరీస్‌లో ప్రధానంగా చూపించనున్నారు. సుస్మితా సేన్ చిన్నప్పటి నుంచే ట్రాన్స్‌జెండర్‌గా మారిపోయినట్లుగా ఆమెను చూపించి ఈ సిరీస్‌పై మరింత ఆసక్తిని పెంచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘ ఈ కథ వినగానే మరో ఆలోచన లేకుండా ఒప్పుకున్నా. కానీ, ట్రాన్స్‌జెండర్ పాత్ర కోసం రెడీ కావడానికి దాదాపు ఆరున్నర నెలల సమయం పట్టింది. ప్రత్యేకమైన పాత్ర చేస్తున్నప్పుడు పరిశోధన కూడా అవసరం’’ అంటూ సుస్మితా చెప్పుకొచ్చింది.

Next Story

Most Viewed