- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెగాఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. చిరుకు జోడీగా బాలీవుడ్ హాట్ బ్యూటీ.. సూపర్ కాంబో అంటూ నెటిజన్ల కామెంట్స్!
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’(Vishvambhara). ఈ చిత్రాన్ని వశిష్ట భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’(Vishvambhara). ఈ చిత్రాన్ని వశిష్ట భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. దీనిని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ ప్రమోద్, నిరంజన్ రెడ్డి, విక్రమ్ రెడ్డి కలిసి నిర్మి్స్తున్నారు. ఇక ఇందులో మెగాస్టార్ చిరంజీవి సరసన త్రిష, అషికా రంగనాథ్(Ashika Ranganath) ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం వాయిదాలు పడుతూ వస్తోంది. ఇంకా కొంత షూటింగ్ మిగిలి ఉన్నందున మూవీ మేకర్స్ రిలీజ్ అప్డేట్ ప్రకటించడం లేదు.
దీంతో మెగాఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఓ సూపర్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మూవీ ఐటెం సాంగ్‌లో బాలీవుడ్ బ్యూటీ మౌనీరాయ్ చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ పాటకు కీరవాణిని కాకుండా భీమ్స్ సిసిరోలియోతో చేయిస్తున్నారు. ఇన్నాళ్లు చిరు సరసన కన్నడ బ్యూటీ నిశ్విక నాయుడు ఫిక్స్ అయినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆమెను కూడా కాదని మౌనీరాయ్‌ను దింపుతున్నారట మూవీ మేకర్స్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు వైరల్ అవుతుండటంతో అవి చూసిన నెటిజన్లు సూపర్ కాంబో అదరిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు.






