- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాని 31 మూవీ నుంచి అదిరిపోయే గ్లింప్స్ రిలీజ్
దసరా పండుగ సందర్భంగా నేచురల్ స్టార్ నాని తన అభిమానుల కోసం సూపర్ అప్ డేట్ ఇచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్ : దసరా పండుగ సందర్భంగా నేచురల్ స్టార్ నాని తన అభిమానుల కోసం సూపర్ అప్ డేట్ ఇచ్చారు. ‘అంటే.. సుందరానికీ’ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా ‘నాని ౩1చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి చిత్ర యూనిట్ దసరా పండుగ సందర్భంగా అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమాకు ‘సరిపోదా శనివారం’ టైటిల్‌ను పిక్స్ చేశారు. అంతేకాక ఫస్ట్ పోస్టర్‌తోపాటు గ్లింప్స్‌ను విడుదల చేశారు. 2.48 నిమిషాలు ఉన్న ఈ గ్లింప్స్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది. 'రాజైనా.. బంటైనా తమ రోజు వచ్చే వరకు వేచి చూడాలి' అంటూ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. సంకెళ్లతో ఉన్న నాని లుక్ సినిమాపై ఆసక్తిని పెంచింది. కాగా, ఈ గ్లింప్స్‌లో నాని ఓ షెడ్‌లో గొలుసులతో బందీగా ఉన్నట్లు చూపించారు. సాయికుమార్ వాయిస్ ఓవర్‌తో వచ్చిన ఈ గ్లింప్స్ ప్రేక్షకులను ఉత్కంఠతతో కట్టిపడేస్తోంది. ఈ వారం సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో నాని సరసన ప్రియాంకా అరుల్ మోహన్ నటిస్తోంది.






