ఆ ఫొటోలు బయటపెడతా.. జాక్వెలిన్‌కు మాజీ ప్రియుడు సుకేష్ బెదిరింపులు

by Disha Web Desk 19 |
ఆ ఫొటోలు బయటపెడతా.. జాక్వెలిన్‌కు మాజీ ప్రియుడు సుకేష్ బెదిరింపులు
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ ప్రియుడు సుకేష్ చంద్రశేఖర్‌కు బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ బిగ్ షాక్ ఇచ్చింది. సుకేష్ లేఖల ద్వారా తనను వేధిస్తున్నాడంటూ జాక్వెలిన్ కోర్టును ఆశ్రయించింది. తన ప్రియురాలు కోర్టు మెట్లు ఎక్కడంతో షాక్ తిన్న సుకేష్.. జాక్వెలిన్‌పై బెదిరింపులకు దిగాడు. తనపై కేసులు పెడితే.. తన దగ్గర ఉన్న పర్సనల్ స్క్రీన్ షాట్లు, లావాదేవీలు బయటపెడతానని వార్నింగ్ ఇచ్చాడు. నేను కాపాడుకున్న వ్యక్తే నన్ను వెన్నపోటు పోడవాలని చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, గతంలో సుకేష్, జాక్వెలిన్ సన్నిహితంగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరలైన విషయం తెలిసిందే.

అంతేకాకుండా సుకేష్ తన ప్రియురాలు జాక్వెలిన్‌కు కోట్ల విలువైన బహుమతులు కూడా ఇచ్చినట్లు సినీ సర్కిల్స్‌లో ప్రచారం జరిగింది. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న సుకేష్.. జైలు నుండి కూడా జాక్వెలిన్‌కు లేఖలు రాసిన విషయం తెలిసిందే. జాక్వెలిన్ పుట్టిన రోజు ఓ చారిటికి రూ.20 కోట్లు డొనేషన్ సైతం ఇచ్చాడు. ఈ తరుణంలో సుకేష్ వేధిస్తున్నాడంటూ జాక్వెలిన్ కోర్టును ఆశ్రయిచండం హాట్ టాపిక్‌గా మారింది. సుకేష్ చంద్రశేఖర్ బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, కవిత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌లపై కూడా గతంలో సంచలన లేఖలు రాసిన విషయం తెలిసిందే.


Next Story

Most Viewed