- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండస్ట్రీలో ఆడవాళ్లకు అన్నీ అడ్డంకులే.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన మంచు లక్ష్మి
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి( Manchu Lakshmi)చాలా రోజుల తర్వాత మళ్లీ ‘దక్ష’ (Daksha)సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

దిశ, సినిమా: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి( Manchu Lakshmi)చాలా రోజుల తర్వాత మళ్లీ ‘దక్ష’ (Daksha)సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదొక మెడికల్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్. ఇందులో డాక్టర్ విశ్వామిత్రగా లెజెండరీ నటుడు, కలెక్షన్ కింగ్, పద్మశ్రీ పురస్కార గ్రహీత మోహన్ బాబు(Mohan Babu) ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. వంశీ కృష్ణ మల్లా దర్శకత్వం వహిస్తున్నారు. మంచు ఎంటర్టైన్మెంట్స్, శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. మలయాళ బ్లాక్ బస్టర్ మార్కో సినిమాలో ప్రధాన పాత్ర చేసిన సిద్ధిఖీ, తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడైన తమిళ దర్శకుడు నటుడు సముద్రఖనితో పాటు విశ్వంత్, చిత్రా శుక్ల, మహేష్, వీరేన్ తంబి దొరై తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘ఆడవాళ్లకు అన్ని చోట్లా అడ్డంకులే క్రియేట్ అవుతున్నాయి. ఈ రకమైన బట్టలు వేసుకోవద్దు. అలాంటి పనులు చేయొద్దంటూ రూల్స్ పెడుతున్నారు. ఇదే ప్రశ్న హీరోలను అడిగే ధైర్యం ఉందా మీకు? సమాజంలో ఆడవాళ్లకు ఇప్పటికే ఉన్న కట్టుబాట్లు చాలు, కొత్త రూల్స్ పెట్టొద్దు! సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి మరీ ఎక్కువగా వినిపిస్తుంటాయి. అలాంటి వాటి వల్ల చాలామందికి అవకాశాలు కూడా పోతున్నాయి. మన టాలీవుడ్‌లోనే ఓ హీరో మాజీ భార్య నాతో తన బాధ చెబుతూ చాలా ఎమోషనల్ అయింది.
ఆమెకు సినిమాలు కన్ఫర్మ్ అయిన తర్వాత ఆమె మాజీ భర్త ఏమైనా అనుకుంటాడేమో అని నిర్మాతలు వద్దు అని క్యాన్సిల్ చేసుకుంటురంట. కావాలనే ఆమెకు చాన్సులు ఇవ్వట్లేదు. ఇది మరీ దారుణం’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. అయితే మంచు లక్ష్మీ వారి పేర్లు రివీల్ చేయలేదు. అయినప్పటికీ ఆమె పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించే మాట్లాడిందని చర్చలు మొదలయ్యాయి.






