- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రేమలో ప్రతిదీ ప్రత్యేకమైనదే.. రష్మిక మందన్న ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీ సెకండ్ సింగిల్ అప్డేట్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. భాషతో సంబంధం లేకుండా వచ్చిన అవకాశాలు ఒప్పుకుంటుంది. ప్రస్తుతం రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్’(The Girlfriend)చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి (Dixit Shetty)హీరోగా నటిస్తుండగా.. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీస్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. బ్యూటిఫుల్ లవ్‌స్టోరీతో రాబోతున్న ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు.
సెప్టెంబర్ 5 థియేటర్స్‌లోకి రాబోతున్న ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ హైప్ పెంచాయి. ఇక ఇటీవల ఫస్ట్ సింగిల్ కూడా ప్రేక్షకులను బాగానే మెప్పించింది. అప్పుడే ప్రమోషన్స్ మొదలెట్టిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ టీమ్ వరుస అప్డేట్లు ఇస్తున్నారు. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ పాట రాబోతున్నట్లు ప్రకటించారు. ‘‘ఏం జరుగుతుంది’’ అని సాగే ఈ సాంగ్ ఆగస్టు 26న రాబోతున్నట్లు తెలుపుతూ హీరోహీరోయిన్ ఆనందంగా కిటీలోంచి బయటకు చూస్తున్న పోస్టర్‌ను షేర్ చేశారు. ఈ పోస్ట్‌కు ‘‘ప్రేమలో జరిగే ప్రతిదీ - పడటం నుండి అనుభూతి వరకు - ప్రత్యేకమైనదే’’ అనే క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటుంది.






