నాని ‘ది ప్యారడైజ్’ విషయంలో నిర్మాత చేస్తున్న పనికి అంతా షాక్!

by Mallepaka Hamsa |

నేచురల్ స్టార్ నాని(nani), మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) కాంబినేషన్‌లో వస్తున్న ‘ది ప్యారడైజ్’(The Paradise) చిత్రంపై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి.

నాని  ‘ది ప్యారడైజ్’ విషయంలో నిర్మాత చేస్తున్న పనికి అంతా షాక్!
X

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని(nani), మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) కాంబినేషన్‌లో వస్తున్న ‘ది ప్యారడైజ్’(The Paradise) చిత్రంపై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. ‘దసరా’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న ఈ యాక్షన్ డ్రామా ఇప్పుడు బడ్జెట్ విషయంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. తొలుత ఈ సినిమా బడ్జెట్ రూ. 150 కోట్లు అనుకున్నప్పటికీ, మేకింగ్ క్వాలిట.. కోసం నిర్మాత సుధాకర్ చెరుకూరి ఏకంగా రూ. 200 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. నాని కెరీర్‌లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్ చిత్రం కావడం విశేషం. సినిమా ఇంకా షూటింగ్ దశలో ఉండగానే ఓటీటీ మార్కెట్‌లో ‘ది ప్యారడైజ్’ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ చిత్ర డిజిటల్ రైట్స్‌ను సుమారు రూ. 75 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. నాని సినిమాలకు డిజిటల్, టెలివిజన్ రంగాల్లో ఉన్న విపరీతమైన డిమాండ్ కారణంగానే ఈ భారీ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. దీనికి తోడు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండటంతో ఆడియో రైట్స్ కూడా భారీ ధరకే అమ్ముడయ్యాయని టాక్. నాని సినిమాపై రూ. 200 కోట్లు పెట్టడం అంటే అది ఒకరకంగా సాహసమేనని నెటిజన్లు షాక్ అవుతున్నారు. సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే తప్ప ఇంత భారీ మొత్తాన్ని రికవరీ చేయడం కష్టమని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సినిమాను కేవలం భారతీయ భాషలకే పరిమితం చేయకుండా ఇంగ్లీష్, స్పానిష్‌తో కలిపి మొత్తం 8 భాషల్లో భారీ స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

సికింద్రాబాద్ స్లమ్ ఏరియా నేపథ్యంలో 1990ల కాలం నాటి కథగా రాబోతున్న ఈ మూవీలో నాని ‘జడల్’ అనే మాస్ పాత్రలో కనిపించనున్నారు. సినిమాలో మోహన్ బాబు, రాఘవ జుయల్, కయాదు లోహర్ నటిస్తుండటం మరింత ఆసక్తిని కలిగిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం మార్చి 26న విడుదల కావాల్సి ఉన్నా, పలు కారణాల వల్ల వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా, నాని, శ్రీకాంత్ ఓదెల కాంబో మరోసారి మేజిక్ చేస్తే బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు నమోదవ్వడం ఖాయంమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Next Story