- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వెన్మతితో అందరూ ప్రేమలో పడతారు.. మాళవిక మోహనన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
కోలీవుడ్ యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్(Malavika Mohanan) ‘తంగలాన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

దిశ, సినిమా: కోలీవుడ్ యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్(Malavika Mohanan) ‘తంగలాన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ ఫుల్ ఫామ్‌లో ఉంది. త్వరలో ఈ అమ్మడు ‘హృదయ పూర్వం’(Hridayapoorvam) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సత్యన్ అంతిక్యాడ్ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా.. దీనిని ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. స్టార్ హీరో మోహన్ లాల్(Mohanlal) సరసన మాళవిక హీరోయిన్‌గా నటిస్తుండగా.. సంగీత్, సంగీత, లాలూ అలెక్స్, బసితా జోసెఫ్(Basita Joseph) కీలక పాత్రలో కనిపించబోతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ఓనమ్ పండుగ సందర్భంగా ఆగస్టు 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.
ఈ నేపథ్యంలో.. ప్రమోషన్స్ జోరు పెంచిన మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. తాజాగా, ‘హృదయ పూర్వం’ నుంచి వెన్మతి మెలోడీ సాంగ్‌ను మాళవిక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ‘‘హృదయపూర్వం ఆల్బమ్ నుండి నాకు ఇష్టమైన పాటలలో ఒకటి ‘వెన్మతి’. ప్రభాకరన్‌జస్టిన్ మీరు సృష్టించిన అందమైన, మనోహరమైన ట్రాక్. నేను ఈ ట్రాక్‌ను విన్న ప్రతిసారీ నాకు అన్ని రకాల అనుభూతిని కలిగిస్తుంది. సిద్ శ్రీరామ్‌సర్ మీ గొంతు ఎప్పటిలాగే అద్భుతంగా ఉంది. మీరంతా ‘వెన్మతి’ పాటను వినండి.. దానితో ప్రేమలో పడండి’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ సాంగ్ ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తుంది. అది చూసిన నెటిజన్లు సూపర్, ఎక్స్‌లెంట్ అని కామెంట్లు పెడుతున్నారు.






