- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రతి మహిళ బాధితురాలే.. జీవించడమే పెద్ద పోరాటంగా మారింది.. నటి షాకింగ్ కామెంట్స్
ఈ సమాజంలో ఒక మహిళగా ప్రతిరోజూ సవాళ్లను ఎదుర్కుంటూ బతకడమే నాకు చాలా కష్టంగా అనిపిస్తోంది.

దిశ, సినిమా: తాప్సీ పన్ను(Taapsee Pannu), కని కుస్రుతి(Kani Kusruti) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘అస్సీ’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో 'పరిమ' అనే వివాహితగా, అత్యాచార బాధితురాలిగా కని కుస్రుతి నటించారు. ఈ పాత్ర చేసే క్రమంలో ఆమె ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అత్యాచారానికి గురైన ఒక మహిళ అనుభవించే నరకాన్ని మరొకరు పూర్తిగా అర్థం చేసుకోవడం అసాధ్యమని కని తెలిపారు. ‘‘ఒక నటిగా ఆ బాధను తెరపై పండించడం నాకంటే పెద్ద సవాలు. కొన్ని సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు అది నిజంగా నాకే జరుగుతోందా అనేంతగా లీనమైపోయాను. అయితే ఆ బాధలోకి పూర్తిగా వెళ్తే వ్యక్తిగతంగా నాపై ప్రభావం పడుతుందనే భయంతో కొంత మేర దూరం పాటించాల్సి వచ్చింది’’ అని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా కని కుస్రుతి మన సమాజంలోని మహిళల పరిస్థితిపై ఘాటుగా స్పందించారు. ‘‘భారతదేశంలో దాదాపు ప్రతి మహిళ ఏదో ఒక దశలో వేధింపులను ఎదుర్కొనే ఉంటుంది. వేధింపులు ఎదుర్కొన్న బాధితురాలే.
ఒక నటిగా కెమెరా ముందు అలాంటి పాత్రలో నటించడం కంటే, ఈ సమాజంలో ఒక మహిళగా ప్రతిరోజూ సవాళ్లను ఎదుర్కుంటూ బతకడమే నాకు చాలా కష్టంగా అనిపిస్తోంది. జరగని దానిని నటించడం కంటే, ఇక్కడ జీవించడమే పెద్ద పోరాటం’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాలోని అత్యాచార సన్నివేశాల చిత్రీకరణ సమయంలో జరిగిన ఒక విశేషాన్ని కని బయటపెట్టారు. ఆ సన్నివేశంలో విలన్లుగా నటించిన నటులు ఆ సీన్ చేయాలంటేనే ఎంతో భయపడిపోయారట. ‘‘వారి కళ్లలో భయం చూసినప్పుడు వారు నిజంగానే నటిస్తున్నారని నాకు అర్థమైంది. బయటి సమాజంలో ఒంటరిగా నడుస్తున్నప్పుడు మనకు కలిగే భయం కంటే, ఇలాంటి సామాజిక సమస్యల గురించి మాట్లాడే సినిమాలో భాగం కావడం నాకు ఉపశమనాన్ని ఇచ్చింది’’ అని ఆమె చెప్పుకొచ్చారు.






