ప్రతి సినిమా ఒక గాయంలా ఉండాల్సిన అవసరం లేదు.. హృతిక్ ఆసక్తికర పోస్ట్

by Mallepaka Hamsa |

బాలీవుడ్ హీరో హృతిక్‌రోషన్(Hrithik Roshan), ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘వార్-2’(war-2).

ప్రతి సినిమా ఒక గాయంలా ఉండాల్సిన అవసరం  లేదు.. హృతిక్ ఆసక్తికర పోస్ట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ హీరో హృతిక్‌రోషన్(Hrithik Roshan), ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘వార్-2’(war-2). ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఆగస్టు 14 థియేటర్స్‌లోకి వచ్చి ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయినప్పటికీ ఈ సినిమా ఇంకా ఓటీటీలోకి రాకపోవడం గమనార్హం. ఈక్రమంలో.. తాజాగా, హృతిక్ రోషన్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ పెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ‘‘కబీర్ పాత్రను చాలా సరదాగా పూర్తి చేశాను. నాకు ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తిగా తెలుసుకు కాబట్టి.. కష్టమైనా సరే ఇష్టంతో సులభంగా చేశాను.

నేను ఎవరికైనా చెప్పేది ఒక్కటే. దేన్నైనా తేలిగ్గా తీసుకోండి.. ఒక నటుడిగా మీ బాధ్యతను మీరు 100 శాతం చేయండి. మీ పని మీరు చేసే ఇంటికి వెళ్ళండి. ఈ సినిమా విషయంలో నేను అదే ఫాలో అయ్యాను. నేను చేయాల్సింది చేశా అంతే. షూటింగ్ జరిగినన్ని రోజులు అయాన్ ముఖర్జీ నన్ను చాలా బాగా చూసుకున్నారు. సీన్స్ విషయంలో ఆయన ఎక్కడా రాజీ పడకుండా క్షుణ్నంగా పరిశీలించి తెరకెక్కించారు. ప్రతి సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకంతోనే చిత్రీకరిస్తాం.

ఈ సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు ఎప్పుడూ నా మనసులో రెండు ఆలోచనలు ఉండేవి.. ఇది చాలా సులభం నువ్వు చేయగలవు, ప్రతి మూవీకి గాయాలయ్యేలా చిత్రహింసలు పడుతూ ఉండాల్సినంత అవసరం లేదు. రిలాక్స్‌గా పని చేస్తే.. విజయం దానంతట అదే వస్తుంది’’ అని రాసుకొచ్చారు. అలాగే తన పాత్రకు సంబంధించిన ఫొటోను కూడా షేర్ చేశారు. ఆయన పాజిటివ్‌గా తీసుకోవడం చూసిన నెటిజన్లు వావ్ సూపర్ అని ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తున్నారు.

Next Story