ప్రతి బీట్ ఓ ఎమోషనల్ భాజాలు మొదలయ్యాయి.. ‘బ్యాండ్‌మేళం’ అప్డేట్ ఇచ్చిన శ్రీదేవి

by Mallepaka Hamsa |

‘బ్యాండ్ మేళం’ అప్డేట్ ఇచ్చిన శ్రీదేవి.

ప్రతి బీట్ ఓ ఎమోషనల్ భాజాలు మొదలయ్యాయి.. ‘బ్యాండ్‌మేళం’ అప్డేట్ ఇచ్చిన శ్రీదేవి
X

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని సమర్పణలో వచ్చిన ‘కోర్ట్’ చిత్రంతో టాలీవుడ్‌లో ఓవర్ నైట్ స్టార్‌డమ్ సొంతం చేసుకున్న హీరోయిన్ శ్రీదేవి అపళ్ల(Sridevi Apalla). ఆ సినిమాలో తన నటనతో ప్రశంసలు అందుకున్న ఈ కాకినాడ భామ, ఇప్పుడు తన తర్వాతి ప్రాజెక్ట్ ‘బ్యాండ్ మేళం’(Band Melam)తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాత కోన వెంకట్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరోసారి రోషన్(Roshan), శ్రీదేవి బిగ్ స్క్రీన్‌పై కనిపించబోతున్నారు. ఈ క్రేజీ కాంబో మళ్ళీ రిపీట్ అవుతుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈక్రమంలో.. తాజాగా, ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని శ్రీదేవి స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ చిత్రబృందంతో ఉన్న ఫోటోలను పంచుకుంది. ‘‘ఈ సినిమాలోని ప్రతి బీట్ ఓ ఎమోషన్, వినోదాన్ని, ఉత్సాహాన్ని.. భావోద్వేగాలను పంచుతుంది. మీ హృదయాలను హత్తుకునేలా ఈ కథను చాలా హృదయపూర్వకంగా రూపొందించాం.. భాజాలు మొదలయ్యాయి’’ అని పోస్ట్ పెట్టింది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో సాగే పక్కా ఫీల్ గుడ్ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రాన్ని మేకర్స్ ప్రమోట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇందులో శ్రీదేవి ‘రాజమ్మ’ అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో అలరించబోతోంది.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కు, విజయ్ బుల్గానిన్ అందించిన మ్యూజిక్‌కు సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ వచ్చింది. శ్రీదేవి అపళ్ల కేవలం తెలుగులోనే కాకుండా, ‘కోర్ట్’ సక్సెస్‌తో తమిళంలో కూడా వరుస అవకాశాలను అందుకుంటోంది. అక్కడ ‘ఏగన్’ సరసన ఒక క్రేజీ ప్రాజెక్ట్ చేస్తూనే, తెలుగులో ‘బ్యాండ్ మేళం’తో బాక్సాఫీస్ వద్ద మరో హిట్ కొట్టాలని డిసైడ్ అయింది. అంతేకాకుండా తమిళంలోనూ రాణించాలనే తపనతో వచ్చిన అవకాశాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.

Next Story