ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మహావీరుడు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

by Disha Web Desk 9 |
ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మహావీరుడు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ తాజాగా ‘s’ అనే సినిమాతో సందడి చేశారు. మడోన్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా జులై 14న తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మౌత్ టాక్‌తోనే మంచి విజయాన్ని అందుకుంది. కాగా తాజాగా ఈ సినిమా త్వరలో ఓటీటీలో అడుగుపెట్టనుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఆగస్టు 11 నుంచి తెలుగు, తమిళ్‌లో అందుబాటులోకి రానుంది. అయితే ఈ సినిమాలో హీరో ఓ బస్తీ యువకుడు. ప్రభుత్వం కట్టించిన ఒక నాసిరకం అపార్టుమెంట్‌లోకి తన ఫ్యామిలీతో కలిసి వెళతాడు. అక్కడ అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? వాటిని అతను ఎలా అధిగమిస్తాడు? అనేదే ఈ మూవీ కథ. సినిమా లవర్స్ ఇంకెందుకు ఆలస్యం థియేటర్‌లో మిస్ అయితే ఓటీటీలో చూసేయండి.

Read More: సూపర్‌ స్టార్‌ ‘జైలర్‌’ సినిమా రిలీజ్‌ రోజు ఆ ఉద్యోగులకు సెలవుతో పాటు టికెట్స్ కూడా!

Next Story

Most Viewed