- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ మూవీ హిట్ అవుతుందని తెలిసినా ఆ భయంతోనే చేయలేదు.. సుమంత్ ప్రభాస్ షాకింగ్ కామెంట్స్
నేను అప్పుడే ప్యూర్ పల్లెటూరి తెలంగాణ కథ (మేమ్ ఫేమస్) చేసి ఉన్నాను. వెంటనే మళ్ళీ అలాంటి తెలంగాణ కథే చేస్తే, నేను ఒకే రకమైన పాత్రలకు పరిమితమైపోతాననే భయం వేసింది.

దిశ, సినిమా: యూట్యూబ్ ఆల్బమ్ సాంగ్స్‌తో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న సుమంత్ ప్రభాస్, 'మేమ్ ఫేమస్' సినిమాతో దర్శకుడిగా, నటుడిగా టాలీవుడ్‌లోకి ఘనంగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాతో యూత్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన సుమంత్, దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఇప్పుడు ‘గోదారి గట్టుపైన’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యాడు. గోదావరి నేపథ్యంలో సాగే స్వచ్ఛమైన ప్రేమకథగా రూపొందిన ఈ సినిమా, సమ్మర్ కానుకగా మే 8న థియేటర్లలోకి రాబోతోంది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా సుమంత్ ప్రభాస్ ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాలో మొదట హీరోగా నటించే అవకాశం సుమంత్ ప్రభాస్‌కే వచ్చిందట. దర్శకుడు సాయులు స్వయంగా సుమంత్‌ను కలిసి కథ వినిపించగా, కథ విన్న వెంటనే ఇది కచ్చితంగా పది మంది మాట్లాడుకునే సినిమా అవుతుందని సుమంత్ జోస్యం చెప్పాడట. కానీ, ఒక భయంతో ఆ అవకాశాన్ని రిజెక్ట్ చేసినట్లు సుమంత్ వెల్లడించాడు.
ఆ సినిమాను వదులుకోవడానికి గల కారణాన్ని వివరిస్తూ.. "నేను అప్పుడే ప్యూర్ పల్లెటూరి తెలంగాణ కథ (మేమ్ ఫేమస్) చేసి ఉన్నాను. వెంటనే మళ్ళీ అలాంటి తెలంగాణ కథే చేస్తే, నేను ఒకే రకమైన పాత్రలకు పరిమితమైపోతాననే భయం వేసింది. అందుకే ఆ సినిమా చేయడం నా కెరీర్‌కు కరెక్ట్ కాదేమో అనిపించి వదులుకున్నాను. కానీ ఆ మూవీ మాత్రం కచ్చితంగా రావాలని, సాయులు అన్నకు ఇది 100 శాతం వర్కౌట్ అవుతుందని అప్పట్లోనే చెప్పాను" అని సుమంత్ వివరించాడు. సాయులు తీసిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా చూసిన తర్వాత సుమంత్ ఆశ్చర్యపోయాడట. "ఆయన నాకు కథ చెప్పిన దానికంటే తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. ముఖ్యంగా ఫస్టాఫ్ అయితే చాలా బ్యూటీఫుల్‌గా తీశారు. నేను ఊహించిన దానికంటే చాలా గొప్పగా ప్రజెంట్ చేశారు" అంటూ దర్శకుడి ప్రతిభను కొనియాడాడు. సుమంత్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక మంచి హిట్ సినిమాను వదులుకున్నందుకు కొందరు నెటిజన్లు ఆశ్చర్యపోతుంటే, ఈ సినిమా చేసుంటే ఆయన రేంజ్ మరోలా ఉండేదని రకరకాలుగా చర్చించుకుంటున్నారు. మరికొందరు మాత్రం తన కెరీర్ పట్ల సుమంత్‌కు ఉన్న క్లారిటీని అభినందిస్తున్నారు.






