నేషనల్ అవార్డు వచ్చినా నాకు అవకాశాలు రాలేదు.. నేను తప్పు చేయలేదంటూ కీర్తి ఆసక్తికర కామెంట్స్

by Mallepaka Hamsa |

యంగ్ బ్యూటీ కీర్తి సురేష్(Keerthy Suresh) ‘మహానటి’ (mahanati)సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను మంత్రముగ్దులను చేసింది.

నేషనల్ అవార్డు వచ్చినా నాకు అవకాశాలు రాలేదు.. నేను తప్పు చేయలేదంటూ కీర్తి ఆసక్తికర కామెంట్స్
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ కీర్తి సురేష్(Keerthy Suresh) ‘మహానటి’ (mahanati)సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను మంత్రముగ్దులను చేసింది. అంతేకాకుండా నేషనల్ అవార్డు కూడా దక్కించుకున్న ఆమె తన నటనతో ఎంతో మంది ప్రశంసలు పొందింది. ఈ సినిమాతో కెరీర్‌లో ఎక్కడికో వెళ్తాను అనుకున్న కీర్తి సురేష్ ఊహించని అనుభవం ఎదురైంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి ఈ విషయాలు పంచుకుంది. ‘‘మహానటి తర్వాత ఇండస్ట్రీలో నా మీద అంచనాలు చాలా పెరిగిపోయాయి. దీంతో నాకు అవకాశాలు వస్తాయని అనుకున్నాను. కానీ ఒక ప్రత్యేకమైన పాత్రలోనూ నన్ను ఊహించడం ప్రారంభించారు. అందుకే కమర్షియల్ సినిమాల్లో తీసుకోలేదు. మహానటి తరహా పాత్రలో పరిమితం చేసి చూడటం మొదలెట్టారు.

‘మహానటి’ విడుదల తర్వాత దాదాపు 6 నెలల పాటు నాకు అవకాశాలు రాలేదు. ఎవరై కథ చెప్పలేదు. అయినా నేను నిరాశ చెందలేదు. ఎందుకంటే నేను తప్పు చేయలేదు కాబట్టి అవకాశాలు రాకపోయినా బాధపడలేదు. సానుకూలంగా తీసుకుని ఆ గ్యాప్‌ను మేకోవర్ కోసం ఉపయోగించాను. అవకాశాలు రాలేదని ఎక్కడ వెనుకడుగు వేయకుండా ప్రయత్నించి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుని నా రేంజ్‌ను పెంచుకున్నా’’ అని చెప్పుకొచ్చింది. కాగా.. ప్రస్తుతం కీర్తీ సురేష్ రివాల్సవర్ రీటా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ లేడీ ఓరియెంటెడ్ చిత్రం నవంబర్ 28న థియేటర్స్‌లోకి రానుంది.

Next Story