నన్ను అతను వేధిస్తున్నా నాతో పని చేసిన ఆ హీరో, డైరెక్టర్ పట్టించుకోలేదు: గౌరీ కిషన్

by Mallepaka Hamsa |

గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో గౌరీ కిషన్ (Gauri Kishan)పేరే మార్మోగిపోతోంది.

నన్ను అతను వేధిస్తున్నా నాతో పని చేసిన ఆ హీరో, డైరెక్టర్ పట్టించుకోలేదు: గౌరీ కిషన్
X

దిశ, సినిమా: గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో గౌరీ కిషన్ (Gauri Kishan)పేరే మార్మోగిపోతోంది. ఇటీవల ‘అదర్స్’ (Others)మూవీ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న ఆమెను ఓ రిపోర్టర్ బాడీ షేమింగ్ చేసిన విషయం తెలిసిందే. తన బరువు గురించి అడగడంతో.. వెంటనే గౌరీ కిషన్ ఫైర్ అయిపోయింది. నా బరువు గురించి ఎందుకు ప్రశ్నిస్తున్నారు.. మీకు నా సినిమాలు కావాలి కానీ బరువు ఎందుకు.. ఒక హీరోయిన్‌ను ఇలాంటి ప్రశ్న అడగడం ఏంటని మండిపడింది. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో క్షణాల్లో వైరల్ అయిపోయింది.

ఈ విషయం తెలుసుకున్న ప్రజలు, సినీ సెలబ్రిటీలు సైతం ఈ విషయాన్ని ఖండిస్తూ రిపోర్టర్‌ను బండబూతులు తిడుతున్నారు.సెలబ్రిటీలు కూడా గౌరీకి సపోర్ట్ చేస్తూ.. ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. కానీ నాతో పని చేసిన హీరో ఆదిత్య మాధవన్, డైరెక్టర్ అభిన్ హరికరణ్ ఈ విషయంపై స్పందించలేదు. తాజాగా, ఈ విషయాన్ని వెల్లడిస్తూ గౌరీ ఎమోషనల్ అయింది.

‘‘నిన్న అక్షరాలా ఒక వేధింపులు జరిగాయి. నన్ను ఆ ప్రశ్న అడిగి ఇబ్బంది పెట్టిన వ్యక్తి జర్నలిస్ట్ కాదు, యూట్యూబర్ అని తెలిసింది. ఒకవేళ జర్నలిస్ట్ అయినా అతను జర్నలిజం నుండి నిష్క్రమించాలి. ఆ సమయంలో నా హీరో/డైరెక్టర్ నాకు సపోర్ట్‌గా నిలబడలేదని నేను నిరాశ చెందాను. కానీ అది వారి ఇష్టం. సోషల్ మీడియాలో ప్రజలు & సెలబ్రిటీలు నాకు మద్దతు ఇస్తున్నందుకు నేను సంతోషంగా ఉన్నాను’’ అని చెప్పింది. ఈ విషయం పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Next Story