- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘రామాయణం’ చేయాలనుకున్నా.. మంచు విష్ణు ఆసక్తికర కామెంట్స్.. వద్దు బాబోయ్ అంటూ నెటిజన్ల కామెంట్స్
టాలీవుడ్ హీరో మంచు విష్ణు(manchu vishnu) ఇటీవల ‘కన్నప్ప’(Kannappa) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో మంచు విష్ణు(manchu vishnu) ఇటీవల ‘కన్నప్ప’(Kannappa) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీలో తన ముగ్గురు పిల్లలు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వచ్చిన ఈ చిత్రంలో స్టార్స్ కాజల్ అగర్వాల్, మోహన్‌లాల్(Mohanlal), అక్షయ్ కుమార్(Akshay Kumar), మోహన్ బాబు, బ్రహ్మానందం వంటి వారు కీలక పాత్రలో కనిపించారు. అయితే భారీ అంచనాల మధ్య ‘కన్నప్ప’ మూవీ జూన్ 27న థియేటర్స్‌లోకి వచ్చింది. కానీ అనుకున్నంతగా మెప్పించలేకపోయింది. బాక్సాఫీసు వద్ద మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో చాలామంది మంచు విష్ణులు తిట్టుకున్నారు. ఎందుకంటే దేవుడి సినిమా అని చెప్పి ఇందులో విష్ణు, ప్రీతి ముకుందన్ రొమాన్స్ చేయడంపై విమర్శలు చేస్తున్నారు.
ఈక్రమంలో.. తాజాగా, మంచు విష్ణు ‘రామాయణం’ సినిమా చేయాలని ఉందంటూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘‘రావణుడి జననం నుండి మరణం వరకు నా దగ్గర ఇప్పటికే ఒక స్క్రిప్ట్ ఉంది. 2009 లో, రాఘవేంద్రరావు దర్శకుడిగా రాముడి పాత్ర పోషించడానికి నేను సూర్యను సంప్రదించాను. సీతగా ఆలియా భట్‌ను తీసుకుందాంమని అనుకున్నాను. బడ్జెట్ సమస్యల కారణంగా అది జరగలేదు. నా తండ్రి తప్ప మరెవరినీ.. రావణుడిగా ఊహించలేను’’ అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు వద్దు బాబోయ్ మీకో దండం ‘కన్నప్ప’ చిత్రాన్నే నాశనం చేశావంటూ ట్రోల్ చేస్తున్నారు.






