వాళ్లు నా ప్రాణాలు తోడేస్తున్నారు.. ఎప్పుడూ చేయలేదని చెప్పినా వినడం లేదంటూ విజయ్ షాకింగ్ పోస్ట్

by Mallepaka Hamsa |

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎంతలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

వాళ్లు నా ప్రాణాలు తోడేస్తున్నారు.. ఎప్పుడూ చేయలేదని చెప్పినా వినడం లేదంటూ విజయ్ షాకింగ్ పోస్ట్
X

దిశ, సినిమా: రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎంతలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో హిట్ అందుకుని బాక్సాఫీసు షేక్ చేసిన ఆయన హీరోల లిస్ట్‌లోకి చేరిపోయాడు. ఆ తర్వాత ‘గీతా గోవిందం’ చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ హిట్‌ దక్కించుకుని ఫామ్‌లోకి వచ్చేశాడు. కానీ గత కొద్ది కాలంగా ఆయనకు విజయం వరించడం లేదు. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, ఖుషి, ఫ్యామిలీస్టార్ కింగ్‌డమ్ వంటి చిత్రాలు డిజాస్టర్లుగా నిలచాయి. ఇక ‘లైగర్’ చిత్రంతో విజయ్ సినీ కెరీర్‌పై ప్రభావం చాలానే పడింది.

భారీ డిజాస్టర్ కావడంతో పాటు విజయ్‌పై ట్రోలింగ్ కూడా జరిగింది. అయినప్పటికీ వాటిని పట్టించుకోకుండా హిట్, ఫ్లాప్ అని ఆలోచించకుండా బాక్సాఫీసు వద్ద విజయ్ తన యుద్ధాన్ని మాత్రం ఆపడంలేదు. వరుస చిత్రాల్లో నటిస్తూ.. ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ రవి కిరణ్ కోలా(Ravi Kiran Kola)తో ‘రౌడీ జనార్ధన్’ (Rowdy Janardhan)చేస్తున్నారు. రా అండ్ రస్టిక్ కంటెంట్‌తో రానుంది. మరొకటి పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ రెండు సినిమాలపై చాలా ఆశలే పెట్టుకున్నాడు విజయ్. అందుకే ఈ రెండు సినిమాల కోసం కెరీర్ లో ఎప్పుడు పడనంతగా కష్టపడుతున్నాడు.

ఈ సారి ఎలాగైనా హిట్ అందుకోవాలన్న కసితో పని చేస్తున్నారు. షూటింగ్ జరుపుకుంటున్న ఈ రెండు చిత్రాలు వచ్చే ఏడాది విడుదల కాబోతున్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా, విజయ్ దేవరకొండ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ షాకింగ్ పోస్ట్ పెడుతూ తన కష్టాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ‘‘కెరీర్‌లో మొదటిసారి ఒకేసారి 2 భారీ చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొంటున్నాను. ఈ రెండు సినిమాలు నా నుంచి చాలా డిమాండ్ చేస్తున్నాయి. డైరెక్టర్స్ నా ప్రాణాలు తోడేస్తున్నారు. ఎప్పుడూ ఇలా చేయలేదని చెప్పినా వినడం లేదు. అయినా నేను సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే.. కొత్త టెక్నాలజీని నేను సంపాదించుకున్నందుకు.ప్రస్తుతం ఇష్టమైన వాచ్ - అందమైన వింటేజ్ రోలెక్స్. నేను ఏ ప్రతి ఒక్క పూజ చేస్తున్నాను.

ఎల్లప్పుడూ యుద్ధానికి సిద్ధంగా ఉండటానికి శిక్షణ పొందుతాను. కూల్ ఎఫ్‌కిన్ బట్టలు తయారు చేయాలనే నా మక్కువ - ఈ యూనిఫామ్‌లను త్వరలో వదులుతాను’’ అనే క్యాప్షన్ జత చేస్తూ కొన్ని ఫొటోలు, వీడియోలను షేర్ చేశాడు. ఇక విజయ్ దేవరకొండ పోస్ట్‌పై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఆయన అభిమానులు మాత్రం కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది అన్నా పాజిటివ్‌గా ఉండమని సలహాలు ఇస్తున్నారు. కాగా.. విజయ్ దేవరకొండ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఆయన గత కొద్ది రోజులుగా రష్మిక మందన్నతో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే వీరిద్దరూ ఇటీవల నిశ్చితార్థం కూడా చేసుకున్నట్లు టాక్. ఇక వీరిద్దరి పెళ్లి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రాజస్థాన్‌లో జరగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు వీరిద్దరు ఈ విషయంపై మాత్రం అధికారికంగా స్పందించలేదు. దీంతో ఈ వార్తలు నిజమే అని పెళ్లి చేసుకున్నాక ప్రకటించి బిగ్ ట్విస్ట్ ఇస్తారేమో అని అంతా అభిప్రాయపడుతున్నారు.

Next Story