ఇష్టం లేకున్నా అలాంటి సీన్స్ చేస్తాను : Payal Rajput

by Disha Web Desk 7 |
ఇష్టం లేకున్నా అలాంటి సీన్స్ చేస్తాను : Payal Rajput
X

దిశ, సినిమా: ఒక సినిమా హిట్‌తో రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోతుంటారు కొంత మంది హీరోయిన్లు. అందులో పాయల్ రాజ్‌పుత్ ఒకరు. ‘ఆర్ఎక్స్ 100’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ తర్వాత చేసిన చిత్రాలు ఆ రేంజ్ హిట్టు మాత్రం అందుకోలేకపోయాయి. ఇక తాజాగా ‘మంగళవారం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె.. సూపర్ హిట్ టాక్ రావడంతో హ్యాపీగా ఉంది.

అయితే ఈ సినిమాలో పాయల్ చాలా బోల్డ్ సీన్స్‌లో నటించిన విషయం తెలిసిందే. కాగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెకు.. ‘‘మంగళవారం’ సినిమాలో బోల్డ్ సీన్స్ కోసమే మిమ్మల్ని హీరోయిన్‌గా తీసుకున్నారా?’ అనే ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానంగా.. ‘అజయ్ సార్ ఫోన్ చేయగానే ఎస్ చెప్పేశాను. ‘ఆర్ఎక్స్ 100’ వంటి హిట్ ఇచ్చినందుకు నేను ఆయనతో మళ్లీ కలిసి పనిచేయాలని ఎదురుచూస్తున్నా. అందుకే ఈ సినిమా ఒప్పుకున్నాను. ఇది రొటీన్ చిత్రం కాదు.. చాలా డిఫరెంట్ కథ. ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను.. నేను ఒక నటిని. చాలా ప్రొఫెషనల్‌గా ఉంటాను. ఎలాంటి పాత్ర అయినా మనస్ఫూర్తిగా చేస్తాను. సౌకర్యంగా లేకపోయినా చేయడమే నా పని. అందుకే ఇలాంటి సీన్స్ చేశాను’ అంటూ పాయల్ చెప్పకొచ్చింది.



Next Story

Most Viewed