- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తి స్వేచ్ఛగా తిరిగినా ప్రశ్నించరు ఇదెక్కడి న్యాయం.. చిన్మయి సెన్సేషనల్ పోస్ట్
నటుడు, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) భార్య సింగర్ చిన్మయి(Chinmayi)ని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.

దిశ, సినిమా: నటుడు, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) భార్య సింగర్ చిన్మయి(Chinmayi)ని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. పలు సాంగ్స్ పాడిన ఆమె స్టార్ హీరోయిన్‌కు డబ్బింగ్ చెప్పి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఈనేపథ్యంలోనే పెళ్లి చేసుకుని పర్సనల్ లైఫ్‌లో ఫుల్ బిజీ అయిపోయింది. ఇక తమిళనాడులో చిన్మయిని బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. అప్పటినుంచి పూర్తిగా పాటకు దూరం అయింది. ఇక సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ పలు వివాదాస్పద పోస్టులతో దుమారం రేపుతోంది. అలాగే కొంతమందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అమ్మాయిలకు అన్యాయం చేసిన వారిని ఓ ఆట ఆడేసుకుంటుంది. దేశంలోని జరిగే సంఘటన గురించి తనదైన స్టైల్లో పోస్టులు పెడుతూ ఆలోచింపచేస్తుంది.
కానీ కొందరు చిన్మయిపై విమర్శలు చేసినప్పటికీ భయపడకుండా.. తనకు నచ్చింది చెప్తోంది. అంతేకాకుండా తనను మాటలన్న వారికి మాత్రం స్ట్రాంగ్‌గానే ఇచ్చిపడేస్తుంది. గత కొద్ది కాలంగా ఆమె జాని మాస్టర్‌ను టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతోంది. తాజాగా, ఓ వ్యక్తి చేసిన పని గురించి చెప్తూ.. కొంతమంది ట్విట్టర్ యూజర్లను ప్రశ్నించింది. ‘‘24 రోజుల క్రితం శశి భూషణ్ ఉపాధ్యాయ రైలులో ఒక బాలికను లైంగికంగా వేధిస్తున్న దృశ్యం కెమెరా కంటికి చిక్కింది.
పోలీసులకు సమాచారం అందింది. అయినప్పటికీ ఈ వ్యక్తిని అరెస్టు చేయలేదు. వేరే విధంగా కోపంతో రగిలిపోయి, అభిప్రాయం కోసం ప్రజలను వేధించే ట్విట్టర్ గ్రూపులు ఆ పలుకుబడిని ఉపయోగించి పోలీసులను స్వయంగా తీసుకెళ్లి కేసు తీసుకోవాలని ఒత్తిడి చేయట్లేరు ఎందుకని. చెప్పాల్సినవన్నీ చెబుతారు కానీ ముఖ్యమైనవి విషయాల్లో సైలెంట్‌గా ఉంటారు. 24 రోజుల పాటు లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తి స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నాడు. ఎటువంటి చర్య తీసుకోలేదు. ఇదెక్కడి న్యాయం’’ అని రాసుకొచ్చింది. ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ వేసింది.






