- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆహారం కూడా విషంగా మారుతుంది.. అలాంటి వ్యాధి వల్ల నరకం చూశానంటూ ఫాతిమా షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్(Fatima Sana Sheikh) అతి తక్కువ సమయంలోనే ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది.

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్(Fatima Sana Sheikh) అతి తక్కువ సమయంలోనే ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ‘దంగల్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆమె ఇండస్ట్రీలో రాణిస్తోంది. త్వరలో రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘గుస్తాక్ ఇష్క్’ (Gustak Ishq)మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో విజయ్ వర్మ (Vijay Verma)సరసన రొమాన్స్ చేయనుంది. నవంబర్ 21న థియేటర్స్ విడుదల కాబోతుంది. తాజాగా, ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఫాతిమా తనను ఓ వ్యాధి ఉన్నట్లు వెల్లడించింది. ‘‘నాకు అతిగా తినే అలవాటు ఉంది. ‘దంగల్’ సినిమా షూటింగ్ సమయంలో రోజూ 3 గంటల పాటు సెట్‌లో శ్రమించేదానిని..ఆ తర్వాత కనీసం గంటన్నర సమయం అయినా జిమ్‌లో స్పెండ్ చేసేదాన్ని.
ఈ సినిమా కోసం 3000 కేలరీలు పెరగాలి కాబట్టి బాగా తిన్నాను. కానీ ‘దంగల్’ షూట్ అయిపోయాక కూడా అదే విధంగా తినడం కొనసాగించాను. ఒకానొక దశలో తిండిపై విసుగొచ్చింది. నన్ను నేను చూసుకుని కొన్నిసార్లు భయపడ్డాను కూడా. నేను అతిగా తింటున్నా అని సాన్య మల్హోత్రా అనడంతో నాకు చాలా సిగ్గుగా అనిపించింది. కానీ తిండి మానలేని పరిస్థితి. నిరంతరం ఎక్కువగా తినడం వల్ల శరీరం నియంత్రణలో ఉండేది కాదు. గంటల తరబడి అతిగా తినడం, ఆకలితో ఉండటం అనే సమస్యలను నేను ఎదుర్కొన్నాను. రెండు విపరీత పరిస్థితితుల మధ్య జీవించి నరకం చూశాను. బాగా తిన్న తర్వాత ఆకలితో అలమటించినట్టు అనిపిస్తుంది.
ఒక సంవత్సరం పాటు బులిమియాతో పోరాడాను. ఒక్కొసారి ఆహారం కూడా విషంగా మారిపోతుందనిపించింది. ఆకలి మోడ్ ఆన్ అయితే ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా గంటల తరబడి తింటాను. నాకు పూర్తిగా నియంత్రణ లేకపోవడంతో నేను ఒక సంవత్సరం పాటు బులిమిక్‌గా ఉన్నా. ప్రతి గంటా ఆకలి ఆకలి అంటూ అలమటిస్తాను. బాగా తినేస్తాను. అప్పటికి తిండి గురించి నాకు అంతగా అవగాహన లేదు. కానీ ఇప్పుడు నాకు తిండిపై మంచి అవగాహన ఉంది. ఒక రోజులో ఇన్ని కేలరీలు మాత్రమే తినాలి. ఇప్పుడు కూడా, నేను ఎప్పుడూ ఆహారం గురించే ఆలోచిస్తాను. నాకు ఎప్పుడూ ఆకలిగా ఉంటుంది’’ అని చెప్పుకొచ్చింది. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు షాక్ అవుతున్నారు. అలాంటి వ్యాధి కూడా ఉంటుందా? అని సెర్చ్ చేస్తున్నారు.






