‘EPIC’ మూవీ మ్యూజికల్ జర్నీ స్టార్ట్.. ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన వైష్ణవి చైతన్య

by Mallepaka Hamsa |

‘EPIC’ సినిమాకు సంబంధించిన మ్యూజికల్ అప్‌డేట్‌ ఇచ్చి చిత్ర యూనిట్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేసింది.

‘EPIC’ మూవీ మ్యూజికల్ జర్నీ స్టార్ట్.. ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన వైష్ణవి చైతన్య
X

దిశ, సినిమా: బేబీ’ సినిమాతో కుర్రాళ్ల గుండెల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya).. ఇప్పుడు మరోసారి తన లక్కీ పార్ట్‌నర్ ఆనంద్ దేవరకొండతో కలిసి రచ్చ చేసేందుకు రెడీ అయిపోయింది. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘EPIC’. ‘90s బయోపిక్’ వెబ్ సిరీస్‌తో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ లాంటి బ్యానర్స్‌పై వస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీని నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మ్యూజికల్ అప్‌డేట్‌ ఇచ్చి చిత్ర యూనిట్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేసింది.

షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి మొదటి పాటను విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేశారు. ‘సంచారమే’ అంటూ సాగే ఫస్ట్ సింగిల్‌ను మార్చి 7న ఉదయం 11:08 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు వైష్ణవి తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఇక ఈ పాటను గోరటి వెంకన్న పాడగా.. హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించారు. ఇక ఈ అప్‌డేట్‌తో పాటు విడుదల చేసిన పోస్టర్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఒక కాలేజీ ముందు ఆనంద్, వైష్ణవి ఎంతో హుషారుగా స్టెప్పులు వేస్తున్న ఈ లుక్ చూస్తుంటే.. ఇదొక ఫ్రెష్ కాలేజీ లవ్ స్టోరీ అని అర్థమవుతోంది. ‘బేబీ’లో వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీకి ఆడియన్స్ ఫిదా అయ్యారు. మరి ఈ ‘EPIC’ సినిమాలో ఆ మ్యాజిక్ ఏ రేంజ్‌లో ఉండబోతుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ కావడంతో మ్యూజిక్ విషయంలో అస్సలు రాజీ పడలేదని తెలుస్తోంది.

Next Story