- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
12 ఏళ్లకే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి..ఎంతో జీవితం చూశా.. స్టంట్స్ క్వీన్ సనోబర్
దిశ, సినిమా: తెరమీద ఒక మంచి సినిమా చూస్తున్నాము అంటే దాని వెనుక ఎంతో మంది కష్టం ఉంటుంది. చాలా వరకు మనకు వారి గురించి తెలియదు. ఇక స్టంట్స్ చేస్తూ ఫైట్ సీన్స్ చేసే కోరియోగ్రఫర్‌ల గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. ఎందు కంటే యాక్షన్ మూవీస్‌కి ఉన్న డిమాండ్ మరే సినిమాలకు ఉండదు. ఒక్కో ఫైట్ సూపర్ ఉంది అని జనాలు మాట్లాడుకోవడం మనం వింటూనే ఉంటాం. హీరోలని అంత వైల్డ్ గా చూపించేది ఫైట్ మాస్టర్లే..! కానీ, మహిళలు కూడా ఈ రంగంలో ఉంటారనీ, మగవారితో సమానంగా కష్టపడుతుంటారనీ చాలా మందికి తెలియదు. కానీ 12 ఏళ్లకే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, 200లకు పైగా చిత్రాల్లో పనిచేశారు స్టంట్స్ క్వీన్ సనోబర్.
అతి చిన్న వయసులోనే కరాటేలో బ్లాక్ బెల్ట్ ఉన్న ఆమెకు అనుకోకుండా సినిమాలో అవకాశం వచ్చింది. సెట్లో అడుగుపెట్టిన మొదటి రోజే తనకు ఈ రంగంలో స్థిరపడగలనని నమ్మకం కలిగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సనోబర్ తన కెరీర్‌కి సంబంధించిన విషయాలు పంచుకుంది.. ‘ఇంట్లో వారి సపోర్ట్ ఉన్నప్పటికి నా ప్రయాణం అంత సజావుగా ఏమీ సాగలేదు. ఆడపిల్లే కదా అని చులకన చేయడం, చిన్నపిల్లే కదా అని పట్టించుకోకపోవడం లాంటివి తరచూ ఎదుర్కొన్న. వాటన్నిటినీ తట్టుకుంటూ, గుర్తింపు లేకపోయినా నన్ను నేను ఊరడించుకుంటూ కెరీర్ కొనసాగించా. ఇలాంటప్పుడే కుంగిపోకుండా మనల్ని మనం సంబాళించుకోవాలి. బాధ, సంతోషం మధ్య ఏదో ఒక దాని ఎంచుకునే అధికారం మనకే ఉంటుంది. చిరాగ్గా ఉన్నప్పుడు వ్యాయామం చేస్తే, దాని వల్ల విడుదలయ్యే ఎండార్ఫిన్లు శరీరాన్నే కాకుండా మనసును కూడా తేలిక పరుస్తాయి’ అని తెలిపింది సనోబర్.
Read More..
ప్రకృతికి విరుద్ధంగా ఉన్న వారిని కఠినంగా శిక్షించాలి : దియా మీర్జా