నీ అంత ప్రేమను మాపై ఎవరూ చూపించలేరంటూ.. తారకరత్న భార్య ఎమోషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ యంగ్ హీరో తారకరత్న ఫిబ్రవరి 18న హఠాత్తుగా మరణించిన విషయం తెలిసిందే..

నీ అంత ప్రేమను మాపై ఎవరూ చూపించలేరంటూ.. తారకరత్న భార్య ఎమోషనల్ పోస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో తారకరత్న ఫిబ్రవరి 18న హఠాత్తుగా మరణించిన విషయం తెలిసిందే. జీవితాంతం తోడుండాల్సిన భర్త చనిపోవడంతో తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి అతడి మరణాన్ని జీర్ణించుకోలేక పోతోంది. తారకరత్న లేని జీవితాన్ని ఊహించుకొలేక కుమిలి కుమిలి ఏడుస్తుంది.

తాజాగా, అలేఖ్య రెడ్డి, భర్తను తలుచుకుంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘‘జీవితంలో మనం ఎన్నో పోరాటాలు చేశాం. నీ చివరి రోజుల వరకు కలిసి ఫైట్‌ చేశాం. కార్లలో నిద్రించిన రోజుల నుంచి ఇప్పటివరకు.. మన జీవిత ప్రయాణం అంత సాఫీగా ఏం సాగలేదు. ఈ పోరాటంలో మనం చాలా దూరం వచ్చేశాం. నువ్వు ఒక వారియర్‌ నాన్నా.. నువ్వు చూపించినంత ప్రేమ మాపై ఇంకెవ్వరూ చూపించలేరు’’ అంటూ తారకరత్న చేయి పట్టుకున్న ఫొటోను షేర్ చేసింది. దీంతో అది చూసిన నెటిజన్లు ‘మేమంతా మీకున్నాం, ధైర్యంగా ఉండండి’ అంటూ కామెంట్లతో ఆమెకు మనోధైర్యాన్ని చెప్తున్నారు.

Next Story