- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bigg Boss-9: బిగ్‌బాస్ ఇచ్చిన ట్విస్ట్‌కి బోరున ఏడుస్తున్న ఇమ్ము.. అసలేం జరిగిందంటే?
రెండు వారాలు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ షోలో ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎపిసోడ్స్ రానే వచ్చాయి.

దిశ, సినిమా: రెండు వారాలు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ షోలో ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎపిసోడ్స్ రానే వచ్చాయి. ఇన్నాళ్లు కండబలం, బుద్ధి బలంపై ఫోకస్ చేసిన బిగ్‌బాస్ ఇక ఇప్పుడు ఎమోషనల్ చేసేందుకు సిద్ధమయ్యాడు. కంటెస్టెంట్స్ ఎమోషన్‌తో గేమ్ ప్లాన్ చేసి అందరినీ ఏడిపిస్తున్నాడు. తాజాగా, విడుదలైన ప్రోమో అందర్నీ కన్నీరు పెట్టేలా చేస్తోంది. అసలు అందులో ఏముందంటే.. కంటెస్టెంట్స్‌కు బిగ్‌బాస్ ఓ బంపర్ ఆఫర్ ఇవ్వడంతో పాటు ట్విస్ట్ కూడా ఇచ్చాడు. ఎవరైతే మొదట బజార్ ప్రెస్ చేస్తారో వాళ్లకు ఫ్యామిలీ వాళ్ళు పంపిన సందేశాలు అందుకునే అవకాశం ఉందని చెప్పాడు. అలాగే అందుకు భారీ మూల్యాన్ని చెల్లించాలని వందశాతం నిండిన బ్యాటరీని పెడతాడు.
అలాగే ఈ అవకాశం కొందరికే లభిస్తుందని కూడా చెప్తాడు. దీంతో మొదట ఇమాన్యుయేల్ బజార్ ప్రెస్ చేయగా లోపలికి పిలుస్తాడు. నాన్ని నుంచి వచ్చిన లేఖను పొందాలంటే బ్యాటరీ 45 శాతం తగ్గుతుందని.. అలాగే అమ్మ పంపిన ఆడియో వినాలంటే 30 శాతం బ్యాటరీ, ఓ ఫొటో పొందాలంటే 25 శాతం బ్యాటరీ తగ్గుతుందని అంటాడు. ఇక అదంతా విన్న ఇమ్ము బోరున ఏడుస్తూ మా తట్టుకోలూదు అని అన్నాడు. బయట ఉన్నవాళ్లంతా తనూజ, సుమన్ శెట్టి, ప్రియా తమ ఫ్యామిలీతో మాట్లాడేందుకు బాగా ఎదురుచూస్తున్నారు బిగ్‌బాస్ చాలా ఇబ్బంది పడుతున్నారు అని కాసేపు బాధపడతాడు. ఆ తర్వాత అతి తక్కువ బ్యాటరీతో కూడుకున్న ఫొటోను పొందుతాడు. ప్రస్తుతం ఈ ప్రోమో అందరినీ కన్నీరు పెట్టేలా చేస్తోంది. ఒక రెండో బజార్ తనూజ ప్రెస్ చేసినట్లు తెలుస్తోంది.






