Jabardasth : షోలోనే తన కోరిక తీర్చమని వర్షను అడిగేసిన ఇమ్మాన్యుయెల్

by Disha Web Desk 10 |
Jabardasth : షోలోనే తన కోరిక తీర్చమని వర్షను అడిగేసిన ఇమ్మాన్యుయెల్
X

దిశ, సినిమా: వర్ష-ఇమ్మాన్యుయెల్ నిజంగా ప్రేమికులేనా? లేక ఇద్దరి మధ్య ఏదైనా ఎఫైర్ ఉందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. చెప్పాలంటే చందమామలా ఉండే వర్ష, ఇమ్మానియేల్ వెనకబడటం ఊహించని పరిణామం. కానీ వర్ష కెరీర్‌కు ఇది ప్లస్ అయింది. అనతికాలంలోనే పాపులారిటి దక్కింది. అందుకే ఇమ్మాన్యుయెల్‌తో లవ్ ట్రాక్ కంటిన్యూ చేసింది. అయితే తాజాగా ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశారు. ఇందులో వర్ష-ఇమ్మాన్యుయెల్‌ మాంత్రికుల వేషాలు వేశారు. ఇందులో ‘నాకు నైట్ నిద్ర పట్టడం లేదు. నిద్ర వచ్చేందుకు ఏదైనా మంత్రం చెప్పండి స్వామి’ అని వర్ష ఇమ్మానియేల్‌ను అడిగింది. ‘ఓం భీమ్ ఇమ్మాన్యుయెల్‌‌కు ఒక ముద్దు పెట్టు’ అని అతను చెప్పాడు. దీనికి ‘ఇది మంత్రంలా లేదు. నీ కోరికలా ఉంది’ అని వర్ష సమాధానం చెప్పింది. ‘నీ మనసులో కోరిక కూడా అదే. బయట పెట్టు’ అని అతడు అన్నాడు. ప్రస్తుతం ఈ ఇష్యూ వైరల్ అవుతోంది.

Next Story

Most Viewed