పుకార్లను ఎలా నమ్ముతారో అర్థం కావట్లేదు.. Elizabeth Olsen

by Chukka Sudharani |   (  Updated:2022-09-29 12:48:45  IST  )

Elizabeth Olsen responds to casting rumours for House of the Dragon Season 2

పుకార్లను ఎలా నమ్ముతారో అర్థం కావట్లేదు.. Elizabeth Olsen
X

దిశ, సినిమా : అమెరికన్ యంగ్ బ్యూటీ ఎలిజబెత్ ఒల్సేన్.. 'హౌస్ ఆఫ్ ది డ్రాగన్' సీజన్‌ 2లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే పుకార్లను ఖండించింది. ఇటీవల 2022 ఆగస్టు 21న విడుదలైన 'హౌస్ ఆఫ్ ది డ్రాగన్' మొదటి సీజన్ విమర్శకుల ప్రశంసలతోపాటు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన సమీక్షలను అందుకుంది. దీంతో రెండవ సీజన్ కూడా ఉండబోతుందంటూ ప్రకటించిన దర్శకనిర్మాతలు.. సెకండ్ పార్ట్‌లో కీలక పాత్ర చేయాలంటూ ఎలిజబెత్ ఒల్సేన్‌ను సంప్రదించారని, ఆమె కూడా సిద్ధంగానే ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో రీసెంట్‌గా ఓ ప్రముఖ చానెల్‌తో మాట్లాడుతూ రూమర్స్‌పై ఫైర్ అయిన నటి.. 'అలాంటి పుకార్లు ఎలా ప్రారంభమవుతాయో నాకు తెలియదు. ప్రజలు కూడా వాటిని అఫిషియల్ అని ఎలా భావిస్తారు?' అని ప్రశ్నించింది. ఈ క్రమంలోనే 'హౌస్ ఆఫ్ ది డ్రాగన్'లో నటించడం బాగానే ఉంటుందన్న ఆమె.. అందులోని డ్రీమ్ కాస్టింగ్ కూడా సరదాగా ఉంటుందని తెలిపింది. చివరగా వినూత్నంగా విలువైన కథను చెప్పే ఏ సినిమాలోనైనా నటించేందుకు సిద్ధంగా ఉంటానని ముగించింది.

Next Story