- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎనిమిది గంటల పని శరీరానికి, మనసుకు సరిపోతుంది: దీపికా పదుకొణె
బాలీవుడ్ నటి దీపికా పదుకొణె 8 గంటల పని దినాలు కోరుతోంది. తన కూతురు పుట్టిన తర్వాత ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చిన ఆమె గత కొద్ది రోజులుగా చర్చనీయాశంగా మారింది.

దిశ, సినిమా: బాలీవుడ్ నటి దీపికా పదుకొణె 8 గంటల పని దినాలు కోరుతోంది. తన కూతురు పుట్టిన తర్వాత ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చిన ఆమె గత కొద్ది రోజులుగా చర్చనీయాశంగా మారింది. పని గంటల కారణం కొన్ని భారీ ప్రాజెక్ట్స్ నుంచి తొలగించేశారు. అయినప్పటికీ తన డిమాండ్ సరైనదే అన్నట్లు పలు కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా, దీపికా పదుకొణె (Deepika Padukone)మరోసారి పని గంటల విషయంలో షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత నా తల్లిపై గౌరవం మరింత పెరిగింది. ఆ బాధలు తెలిశాయి. వర్క్‌ను, పిల్లల బాధ్యతను సరిగ్గా ప్రణాళిక వేసుకోవచ్చని అందరూ అంటారు కానీ అది సాధ్యం కాదు. చెప్పడానికి బాగానే ఉన్నా వాస్తవంలో చాలా కష్టం అవుతుంది.
కొత్తగా తల్లి అయిన వారికి అందరూ మద్దతుగా నిలిస్తే కాస్త ధైర్యంగా ఉంటుంది. అధికంగా పని చేయడాన్ని కూడా సాధారణం చేసేశాం. అయితే మహిళలకు రోజుకు ఎనిమిది గంటల పని శరీరానికి, మనసుకు సరిపోతుందని నా ఉద్దేశం. ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే అత్యుత్తమంగా పని చేయగలం. ఒత్తిడిలో ఉన్నప్పుడు మంచి అవుట్‌పుట్ రాదు. అలాగే తల్లి అయ్యాక 8 గంటల పని చాలు. నేను నా సొంత కార్యాలయంలో కూడా ఆరు రోజుల పని దినాలనే పాటిస్తాం.
అది కూడా రోజులో ఎనిమిది గంటలు మాత్రమే వర్క్ చేస్తాం’’ అని చెప్పుకొచ్చింది. కాగాజజ ప్రస్తుతం దీపికా పదుకొణె భారీ ప్రాజెక్ట్ ‘కింగ్’ (King)సినిమాలో షారుఖ్ ఖాన్ సరసన నటిస్తోంది. అలాగే పాన్ ఇండియా మూవీ ‘AA-22’ తో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన రొమాన్స్ చేయనుంది. ఈ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ రెండు ప్రాజెక్ట్స్ వచ్చే ఏడాది థియేటర్స్‌లోకి రాబోతున్నాయి.






