అవకాశాలు లేకున్నా చేతినిండా సంపాదిస్తున్న ఈషా రెబ్బా.. డబ్బుల కోసం దిగజారిపోవాలా? అంటూ నెటిజన్లు ఫైర్!

by Mallepaka Hamsa |   (  Updated:2026-06-02 11:44:08  IST  )

ఈషా రెబ్బా మిగతా హీరోయిన్ల కంటే ఒక అడుగు ముందుకు వేసి, తన ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ కోసం నెలకు ఏకంగా రూ. 399 ఛార్జ్ చేస్తోంది.

అవకాశాలు లేకున్నా చేతినిండా సంపాదిస్తున్న ఈషా రెబ్బా.. డబ్బుల కోసం దిగజారిపోవాలా? అంటూ నెటిజన్లు ఫైర్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్లు సినిమా అవకాశాలు రాకపోవడంతో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా డబ్బులు సంపాదించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్తగా వచ్చిన సబ్‌స్క్రిప్షన్ అనే ఆప్షన్‌ను వాడుకుంటూ ఆదాయం పొందుతున్నారు. ఈ పద్ధతిలో హీరోయిన్ల పర్సనల్ ఫోటోలు, వీడియోలు చూడాలంటే అభిమానులు ప్రతి నెల కొంత డబ్బులు కట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ల ఈ సబ్‌స్క్రిప్షన్ ద్వారా నెలకు ఒక్కో ఫాలోవర్ నుండి రూ. 299 వసూలు చేస్తోంది. అలాగే రామ్ చరణ్ ‘చిరుత’ సినిమా హీరోయిన్ నేహా శర్మ కూడా ఇదే బాటలో నడుస్తూ డబ్బు సంపాదిస్తోంది. తాజాగా, మన తెలుగు బ్యూటీ ఈషా రెబ్బా కూడా ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుతుండటం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

అయితే ఈషా రెబ్బా మిగతా హీరోయిన్ల కంటే ఒక అడుగు ముందుకు వేసి, తన ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ కోసం నెలకు ఏకంగా రూ. 390 ఛార్జ్ చేస్తోంది. గత ఏడాది ‘ఓంశాంతి శాంతి శాంతి’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఈ అమ్మడికి, ప్రస్తుతం టాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు లేవు. అందుకే ఈమె ఈ సబ్‌స్క్రిప్షన్ దారి పట్టినట్లు తెలుస్తోంది. ఫాలోవర్స్ సంఖ్యను బట్టి చూస్తే ఈమెకు నెలకు కూర్చున్న చోటే భారీగా ఆదాయం వచ్చేలా ఉంది. కానీ, ఈషా రెబ్బా తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. కేవలం డబ్బుల కోసమే హీరోయిన్లు ఇలాంటి పద్ధతులు వాడుతూ దిగజారిపోవాలా? అంటూ నెట్టింట ఘాటుగా కామెంట్స్ చేస్తూ ఫైర్ అవుతున్నారు.

Next Story