జపాన్ లో భూకంపం.. తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డ ఎన్టీఆర్.. ఏడుస్తూనే పోస్ట్..

by Dishafeatures1 |
జపాన్ లో భూకంపం.. తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డ ఎన్టీఆర్.. ఏడుస్తూనే పోస్ట్..
X

దిశ, సినిమా : తాజాగా జపాన్ లోని చాలా ప్రాంతాల్లో భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే.ఆల్మోస్ట్ 7 తీవ్రతతో భూకంపం జపాన్ ని వణికించింది. ఈ భూకంపానికి ప్రాణ నష్టం తక్కువే జరిగినా, భారీ ఆస్తి నష్టం జరిగింది. దీంతో జపాన్ త్వరగా కోలుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. ఇక ఇంతలోనే టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ న్యూస్ తెలిప్పారు.

ఇటీవల ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కోసం జపాన్ వెళ్లారు. గత వారం రోజులుగా ఎన్టీఆర్ అక్కడే ఉన్నారు. ఇక నిన్న జపాన్ లో భూకంపం రావడంతో ఎన్టీఆర్ అక్కడే ఉన్నారు అని తెలిసిన వాళ్ళు, కుటుంబ సభ్యులు, అభిమానులు చాలా కంగారు పడ్డారు. అయితే తారక్ దీని గురించి స్పందించాడు.. ‘జపాన్ నుంచి ఇవాళే ఇంటికి తిరిగి వచ్చాను. భూకంపం వార్త విని షాక్ అయ్యాను. గత వారం అంతా జపాన్ లోనే గడిపాను. మేం ఉన్న ప్రాంతంలోనే భూకంపం రావడం నా హృదయాన్ని కలచివేసింది. అక్కడి ప్రజల తిరిగి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ‘స్టే స్ట్రాంగ్ జపాన్’ ’ అంటూ ట్వీట్ చేశారు. ఇక ఈ ఈ ట్వీట్ కాస్తా వైరల్ గా మారడంతో, జపాన్ నుంచి తారక్ సేఫ్ గా వచ్చారు అని తెలిసి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.


Next Story