షూటింగ్‌లో నటితో దసరా విలన్ అసభ్య ప్రవర్తన.. బహిరంగ క్షమాపణలు చెప్పడంతో ఆమె రియాక్షన్‌ చూసి అంతా షాక్!

by Mallepaka Hamsa |

మలయాళ నటుడు షైన్ టామ్ చాకో(Shine Tom Chacko) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

షూటింగ్‌లో నటితో దసరా విలన్ అసభ్య ప్రవర్తన.. బహిరంగ క్షమాపణలు చెప్పడంతో ఆమె రియాక్షన్‌ చూసి అంతా షాక్!
X

దిశ, సినిమా: మలయాళ నటుడు షైన్ టామ్ చాకో(Shine Tom Chacko) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన తెలుగులో నాని హీరోగా నటించిన హిట్ మూవీ ‘దసరా’(dasara)లో విలన్‌గా నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు. ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ బిజీగా మారాడు. అయితే ఇటీవల ఆయన నటి విన్సీ సోనీ(Vinci Sony)తో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు పలు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆమె కూడా ఊహించని కామెంట్స్ చేసింది. తాజాగా, విన్సీ, షైన్ టామ్ చాకో నటించిన ‘సూత్రవాక్యం’ ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. ఈ విషయంపై నటుడు ఆమెకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు.

‘‘సినిమా షూటింగ్ సెట్లో జరిగిన దానికి నేను క్షమాపణలు కోరుతున్నాను. ఉద్దేశపూర్వకంగా నేను ఏదీ చేయలేదు. విన్సీకి ఎటువంటి హాని కలిగించే ఉద్దేశం నాకు లేదు. అయితే విన్సీ అంత తీవ్రంగా స్పందించడానికి కారణం ఉంది. ఎవరో ఆమెను బాగా ప్రోత్సహించి నన్ను తిట్టించారు’’ అని చెప్పుకొచ్చాడు. దీంతో పక్కనే ఉన్న విన్సీ షాక్‌కు గురైంది. వెంటనే మైక్ తీసుకొని మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘నేను ఆరాధించే వ్యక్తి నుంచి ఇలాంటి ప్రవర్తనను నేను అస్సలు ఊహించలేదు.

ఆ సమయంలో ఎంతో బాధపడ్డాను. ముఖ్యంగా నేను స్పందించిన తీరు కూడా చాకో కుటుంబాన్ని ఎంతో బాధించిందని తెలిసింది. ఇక ఇప్పుడు ఈ వివాదం ఇంతటితో ముగిసింది. నిజానికి ఈ సంఘటనపై నేను కూడా విచారం వ్యక్తం చేస్తున్నాను. చాకో నుంచి అలాంటి అనుభవాన్ని నేను ఊహించలేదు. ఇప్పుడు ఈ వివాదం సమిసిపోయినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని తెలిపింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు షాక్ అవుతున్నారు. అప్పుడు అంతలా విరుచుకుపడిన విన్సీ నుంచి ఇలాంటి కామెంట్స్ ఊహించలేదని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.

Next Story