- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాలంతో ప్రతిధ్వనించే ప్రేమ.. దుల్కర్ సల్మాన్ ‘కాంత’ ఫస్ట్ సింగిల్ రిలీజ్
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) ‘సీతారామం’ మూవీతో వరల్డ్ వైడ్‌గా ఉన్న ప్రేక్షకులను అలరించాడు.

దిశ, సినిమా: మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) ‘సీతారామం’ మూవీతో వరల్డ్ వైడ్‌గా ఉన్న ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం తెలుగులో వరుస చిత్రాలు చేస్తున్నారు. విభిన్న కథలు ఎంచుకుంటూ భారీ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తున్నారు. దుల్కర్ నటిస్తున్న సినిమాలో ‘కాంత’ ఒకటి. రానా నిర్మిస్తున్న ఈ చిత్రం లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సముద్రఖని(Samuthirakani ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ వచ్చే సెప్టెంబర్ 12న థియేటర్స్‌లోకి రాబోతుంది.
దీంతో అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన ‘కాంత’ చిత్రబృందం వరుస అప్డేట్స్ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన మ్యూజికల్ జర్నీని స్టార్ట్ చేశారు. ఇందులోంచి ‘పసిమనసే’ మోలోడి సాంగ్‌ను రిలీజ్ చేసి సినీ ప్రియులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇందులో దుల్కర్, భాగ్యశ్రీ బోర్సే కెమిస్ట్రీ అదిరిపోయింది. ఈ సాంగ్‌కు చిత్రబృందం ‘‘కాలంతో పాటు ప్రతిధ్వనించే ప్రేమ. కాంత నుంచి మా మొదటి సింగిల్‌తో పట్టణాన్ని ఎరుపు రంగులోకి మారుస్తున్నప్పుడు పసి మనసే లిరిక్స్‌ను ఎంజాయ్ చేయండి’’ అని రాసుకొచ్చారు.






