‘లోకా’ సీక్వెల్‌లో మెగాస్టార్.. ఆయనతో స్క్రీన్ పంచుకోవడం గర్వంగా ఉందంటున్న దుల్కర్ సల్మాన్

by Mallepaka Hamsa |   (  Updated:2025-11-12 06:34:33  IST  )

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) నిర్మాణంలో వచ్చిన ‘లోకా: చాప్టర్1చంద్ర’ (Loka: Chapter 1Chandra)సూపర్ హిట్‌గా నిలిచింది.

‘లోకా’ సీక్వెల్‌లో మెగాస్టార్.. ఆయనతో స్క్రీన్ పంచుకోవడం గర్వంగా ఉందంటున్న దుల్కర్ సల్మాన్
X

దిశ, సినిమా: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) నిర్మాణంలో వచ్చిన ‘లోకా: చాప్టర్1చంద్ర’ (Loka: Chapter 1Chandra)సూపర్ హిట్‌గా నిలిచింది. కళ్యాణి ప్రియదర్శన్, నస్లెన్ కాంబోలో వచ్చిన ఈ చిత్రానికి డొమినిక్ అరుణ్(Dominic Arun) దర్శకత్వం వహించారు. ఆగస్టు 28 థియేటర్స్‌లోకి వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు..భారీ కలెక్షన్లు రాబట్టి పలు రికార్డులు రాబట్టుకుంది. థియేటర్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్న సమయంలోనే దుల్కర్ ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు ప్రకటించాడు.

ఇందులో టోవినో థామస్(Tovino Thomas), దుల్కర్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు గ్లింప్స్ వీడియోను కూడా షేర్ చేసి ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఇంకా షూటింగ్ ప్రారంభించనప్పటికీ త్వరలోనే.. అన్ని వివరాలు వెల్లడిస్తానని దుల్కర్ చెప్పాడు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ‘లోకా’ సీక్వెల్‌లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్నట్లు స్పష్టం చేశాడు. "లోకా బడ్జెట్ మనం మొదట అనుకున్న దానికంటే రెట్టింపు అయింది. నాన్నతో చెప్పడంతో ఈ విషయం తెలిసి కొంచెం టెన్షన్ పడ్డాడు. కానీ లాభాలు వచ్చాయి. ‘లోకా’ సీక్వెల్‌లో మమ్ముట్టి ఖచ్చితంగా కనిపిస్తారు.

నేను నా తండ్రితో చేస్తున్న మొదటి సినిమా ఇదే. ఇండస్ట్రీకి వచ్చిన 14 సంవత్సరాల తర్వాత నేను ఈ అవకాశం పొందడం సంతోషంగా అనిపిస్తోంది. నేను అడిగినందుకే ఆయన నటించేందుకు ఒప్పుకున్నారు. మొదట నన్ను నేను నిరూపించుకోవాలని అనుకున్నాను. అందుకే పార్ట్1లో నటించమని అడగలేదు. అది హిట్ అయ్యాక సీక్వెల్‌లో యాక్ట్ చేయమని అడిగా. నాన్నతో స్క్రీన్ పంచుకోవడం గర్వంగా ఫీల్ అవుతున్నాను’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Next Story