ఎల్ల‌మ్మ కోసం భారీ ప్లాన్‌... హీరోగా DSP ?

by velandi.Saikiran |

దేవిశ్రీప్రసాద్ హీరోగా ఎల్లమ్మ సినిమా చేసేందుకు వేణు సిద్ధమైనట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో ప్రచారం జోరు అందుకుంది

ఎల్ల‌మ్మ కోసం భారీ ప్లాన్‌... హీరోగా DSP ?
X

దిశ‌, వెబ్ డెస్క్ : బలగం సినిమాతో స్టార్ అయిపోయిన కమెడియన్ వేణు ఎల్లమ్మ ప్రాజెక్టు పట్టుకొని తిరుగుతున్న సంగతి తెలిసిందే. 2023 నుంచి ఈ ప్రాజెక్టుపై వర్క్ చేస్తున్నాడు వేణు. అయితే ఇప్పటి వరకు హీరోను మాత్రం ఫైనల్ చేయలేదు. దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా వస్తోందని ఇప్పటికే రివీల్ కాగా, హీరోను మాత్రం ఫైనల్ చేయలేదు. ఇప్పటి వరకు నలుగురు హీరోల వద్దకు ఈ కథ వెళ్లినట్లు చర్చ జరుగుతోంది. నితిన్, హీరో నాని, శర్వానంద్ వద్దకు ఈ సినిమా కథ వెళ్ళిందని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

ఇటీవల కాలంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ దగ్గరకు కూడా ఎల్లమ్మ కథ వెళ్లినట్లు జోరుగా చర్చ జరిగింది. దీంతో బెల్లంకొండ ఫైనల్ అవుతాడని అందరూ అనుకున్నారు. ఇంతలోనే మరో ట్విస్ట్ నెలకొంది. ఈ ప్రాజెక్టులోకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ రాబోతున్నారట. అది కూడా దేవిశ్రీప్రసాద్ హీరోగా ఎల్లమ్మ సినిమా చేసేందుకు వేణు సిద్ధమైనట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో ప్రచారం జోరు అందుకుంది. అయితే దీనిపై చిత్ర బృందం ఇంకా అధికారిక ప్రకటన ఎక్కడ చేయలేదు. కానీ డీఎస్పీ పేరు మాత్రం జోరుగా వినిపిస్తోంది.






Next Story