‘దృశ్యం-3’ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్పెషల్ వీడియోతో సర్‌ప్రైజ్ ఇచ్చిన మేకర్స్

by Mallepaka Hamsa |

త్యంత ప్రేక్షకాదరణ పొందిన క్రైమ్ థ్రిల్లర్‌లో ‘దృశ్యం’ మూవీ ఒకటి. ఈ సినిమా అన్ని భాషల్లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

‘దృశ్యం-3’ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్పెషల్ వీడియోతో సర్‌ప్రైజ్ ఇచ్చిన మేకర్స్
X

దిశ, సినిమా: అత్యంత ప్రేక్షకాదరణ పొందిన క్రైమ్ థ్రిల్లర్‌లో ‘దృశ్యం’ మూవీ ఒకటి. ఈ సినిమా అన్ని భాషల్లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అయితే మరీ ముఖ్యంగా బాలీవుడ్‌లో అజయ్ దేవ్‌గన్(Ajay Devgn), శ్రియ నటించిన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలవడంతో.. దీనికి సీక్వెల్‌గా వచ్చిన ‘దృశ్యం-2’ కూడా మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు మూడోవ భాగం తెరకెక్కిస్తున్నారు. ‘దృశ్యం-3’ (Drishyam 3)టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రంలోఅజయ్ దేవ్‌గన్, టబు, శ్రియ శరన్, రజిత్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

స్టార్ స్టూడియో 18 సమర్పణలో, పనోరమా స్టూడియోస్ బ్యానర్స్‌పై అలొక్ జైన్, అజిత్ అందారే, కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్ నిర్మిస్తున్నారు. అభిషేక్ పాఠక్ (Abhishek Pathak)దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా, మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ వచ్చే ఏడాది అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్నట్లు తెలుపుతూ.. అనౌన్స్‌మెంట్ వీడియోను షేర్ చేశారు. ఇందులో అజయ్ దేవ్‌గన్ సాల్గావ్కర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. మూడో భాగంలో కూడా అదే సస్పెన్స్, మైండ్‌గేమ్, ఎమోషన్‌ల మేళవింపుతో కథ రాబోతుందని చిత్ర బృందం చెబుతోంది. ముఖ్యంగా ‘దృశ్యం-2’ ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచి కథను కొనసాగించనున్నారని తెలుస్తోంది. అందుకే ఈ సినిమాపై ఆసక్తి రెట్టింపు అయింది. అజయ్ దేవ్‌గన్ అద్భుతమైన నటనతో సాల్గావ్కర్ పాత్రను మరింత బలంగా చూపించనున్నట్లు మేకర్స్ భావిస్తున్నారు.

టబు పాత్ర కూడా ఈ సిరీస్‌కు హైలైట్. ఆమె, అజయ్ దేవ్‌గన్‌ మధ్య జరిగే మైండ్ గేమ్స్ ప్రేక్షకులను మళ్లీ ఊపిరి బిగబట్టేలా చేసే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా శ్రియ శరన్ కూడా కుటుంబ భావోద్వేగాలను మరింత బలంగా కనిపించనున్నారు. ఈ సినిమాలో కథ మరింత పెద్దది, మరింత క్లిష్టమైన మలుపులతో రావచ్చని పరిశ్రమలో సమాచారం. ముఖ్యంగా గత హత్య రహస్యాన్ని పూర్తిగా వెలికితీయడానికి పోలీసులు ఈసారి ఎలాంటి వ్యూహాలు రచించారనేది ఆసక్తికర అంశం. విజువల్స్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, కొత్త పాత్రలతో సినిమా సిరీస్‌ను మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని టీమ్ లక్ష్యంగా పెట్టుకుంది.


Next Story