Anushka Shetty: ‘ఘాటి’ నుంచి డబుల్ అప్డేట్స్.. ఆమె పాలన ప్రారంభమవుతుందంటూ మూవీ మేకర్స్ ట్వీట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-08-04 12:59:34  IST  )

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి(Anushka Shetty) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఘాటి’(Ghaati).

Anushka Shetty: ‘ఘాటి’ నుంచి డబుల్ అప్డేట్స్.. ఆమె పాలన ప్రారంభమవుతుందంటూ మూవీ మేకర్స్  ట్వీట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి(Anushka Shetty) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఘాటి’(Ghaati). ఈ మూవీకి క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) దర్శకత్వం వహిస్తుండగా.. లేడీ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కుతోంది. యాక్షన్ థ్రిల్లర్‌లో విక్రమ్ ప్రభు కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. దీనికి నాగవెల్లి విద్యాసాగర్ సంగీతం అందిస్తున్నారు.

అయితే జూలైలో విడుదల కావాల్సిన ఈ సినిమాను పలు కారణాల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. ‘ఘాటి’ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. థియేటర్స్‌లోకి ఎప్పుడెప్పుడు రాబోతుందా? అని సినీ ప్రియులు, అనుష్క అభిమానుల ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, ‘ఘాటి’ మూవీ మేకర్స్ గుడ్ న్యూస్ ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్, రిలీజ్ తేదీ ఆగస్టు 6న బుధవారం ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. అలాగే ‘‘మీ నిరీక్షణ ముగించే సమయం ఆసన్నమైంది. త్వరలో ఆమె పాలన ప్రారంభమవుతుంది’’ అనే క్యాప్షన్ జత చేశారు. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

link

Next Story