రవితేజ-గోపీచంద్‌ల మూవీలో డబుల్‌ గ్లామర్ డోస్‌

by Disha Web Desk 7 |
రవితేజ-గోపీచంద్‌ల మూవీలో డబుల్‌ గ్లామర్ డోస్‌
X

దిశ, సినిమా: మాస్ హీరో రవితేజ, గోపీచంద్ మలినేని కాంబోలో మరో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. వీరి కాంబోలో ఇప్పటివరకు వచ్చిన మూడు సినిమాలు మంచి హిట్ అందుకోగా ఇప్పుడు నాల్గొవ చిత్రం భారీ బడ్జెట్‌‌లో తెరకెక్కించబోతున్నాడు గోపీచంద్. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. అందులో మొదటగా వినిపిస్తున్న పేరు రష్మిక మందన్నా. ఈ ముద్దుగుమ్మకు పాన్ ఇండియా స్థాయిలో ఫ్యాన్స్ ఉన్నారనే ఆమెను ఇందులోకి తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇక సెకండ్ హీరోయిన్‌గా కృతిశెట్టిని తీసుకునే ప్లాన్‌లో ఉన్నారట మేకర్స్. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సివుంది.

Next Story

Most Viewed