Rangabali Trailer : డబుల్ డోస్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ ‘రంగబలి’ ట్రైలర్

by Chukka Sudharani |   (  Updated:2023-12-16 14:56:21  IST  )

యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం ‘రంగబాలి’.

Rangabali Trailer :  డబుల్ డోస్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ ‘రంగబలి’ ట్రైలర్
X

దిశ, సినిమా: యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం ‘రంగబాలి’. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రానికి పవన్ బసంశెట్టి దర్శకత్వం వహించాడు. ఇటీవల విడుదల చేసిన టీజర్‌, సాంగ్‌కు అద్భుతమైన స్పందన రాగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే వినోదం, ప్రేమకథ, యాక్షన్, భావోద్వేగాలు మొదలైన వాటితో కూడిన ఫుల్ ప్యాకేజీ మూవీగా అనిపిస్తుంది. ముఖ్యంగా హీరో డిఫరెంట్ లుక్‌లో మాస్‌గా కనిపించాడు. కమెడియన్ సత్య పాత్ర హాస్యభరితంగా ఉండగా షైన్ టామ్ చాకో విరోధిగా కనిపించాడు. ట్రైలర్‌లో శరత్ కుమార్‌ని కూడా చూపించారు. ఇక మొత్తానికి టీజర్ వినోదభరితంగా ఉండగా, ట్రైలర్ డబుల్ డోస్‌గా ఉంది. జూలై 7న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతుంది.


Next Story