- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిజానిజాలు తెలుసుకోకుండా ఏది పడితే అది రాయొద్దు.. రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
టాలీవుడ్ స్టార్ బ్యూటీ రకుల్ ప్రీతి సింగ్ (Rakul Preet Singh)తెలుగు, హిందీ భాషల్లో వరుస చిత్రాల్లో నటిస్తోంది.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ బ్యూటీ రకుల్ ప్రీతి సింగ్ (Rakul Preet Singh)తెలుగు, హిందీ భాషల్లో వరుస చిత్రాల్లో నటిస్తోంది. అయినప్పటికీ కొన్నిసార్లు లక్ రాకపోవడంతో హిట్ అందుకోలేకపోతుంది. అయితే ఆమె భర్త కూడా నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. వీరికి ఓ నిర్మాణ సంస్థ కూడా ఉంది. ఇక ఈ బ్యానర్‌లో ఇటీవల వచ్చిన ‘బడే మియా చోటే మియా’ (Bade Miyan Chote Miyan)భారీ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో పూజా ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ మూసివేశారనే వార్తలు వస్తున్నాయి. ఆర్థిక సమస్యల వల్ల రకుల్ అత్తింటి వాళ్లు దివాలా తీశారంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ ఈ విషయంపై స్పందించి క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో యుగంలో మంచి కంటే చెడు వార్తలు వేగంగా వ్యాపిస్తున్నాయి.
నిజానిజాలు తెలుసుకోకుండా ఏది పడితే అది రాస్తున్నారు. నాకు నిజాలు తెలుసు కాబట్టి పుకార్లను పట్టించుకోలేదు. పరిశ్రమలో భాగమైనప్పుడు కొన్ని విషయాల గురించి మౌనంగా ఉండడమే మంచిది. జాకీ భగ్నానీ నిర్మాతగా వ్యవహరించిన మూడు సినిమాలు ఆదరణ పొందలేదు. కానీ కంపెని మూసివేయలేదు. ఆర్ధికంగా చాలా నష్టపోయాం. ఇండస్ట్రీలో ప్రతి నిర్మాతకు ఇలా జరగుతుంది. ఒకానొక సమయంలో అమితాబ్‌బచ్చన్‌కు కూడా ఇలానే జరిగింది. ఎదుగుతున్న సమయంలో ఇదంతా ఒక దశ’’ అని చెప్పింది. దీంతో అత్తింట్లో ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ.. తన భర్త నిర్మాణ సంస్థను మూసివేయలేదని క్లారిటీ ఇచ్చి పుకార్లకు చెక్ పెట్టింది.






