లైంగిక హింసకు పాల్పడిన వ్యక్తితో సింగర్ డేటింగ్.. ఊహించని షాక్ ఇచ్చిన ఫ్యాన్స్

by Dishanational2 |
లైంగిక హింసకు పాల్పడిన వ్యక్తితో సింగర్ డేటింగ్.. ఊహించని షాక్ ఇచ్చిన ఫ్యాన్స్
X

దిశ, సినిమా: మహిళలపై తరచూ లైంగిక వేధింపులకు పాల్పడే వ్యక్తి J సైరస్‌తో డేటింగ్, జాత్యహంకార ట్వీట్లు తదితర వివాదాస్పదమైన అరోపణలు ఎదుర్కొంటున్న అమెరికన్ రాపర్, రైటర్ డోజా క్యాట్ ఎట్టకేలకు స్పందించింది. ఇటీవల సీరియల్ డేటర్‌గా పేరుగాంచిన ఆమె ఓవర్ లోడ్ బోల్డ్ డ్రెస్సింగ్‌తోనూ విమర్శలు ఎదుర్కొంది. అయితే ఈ కాంట్రవర్సీలపై మాట్లాడిన డోజా.. ‘ఇది భారీ ఆన్‌లైన్ ఎదురుదెబ్బ. దారుణమైన ట్రోలింగ్‌ వల్ల 500kపైగా ఫాలోవర్లను కోల్పోయా. అయినా ప్రేమను ప్రేమిస్తున్నా. బహుశా నేను సీరియల్ డేటర్‌నే కావొచ్చు. ఎందుకంటే భిన్నమైన ప్రదేశాలు తిరుగుతూ ప్రజలను ప్రేమించడం నేర్చుకుంటున్నా. నేను లవ్ చేసే విధానం చాలా భిన్నంగా ఉంటుంది. కోల్పోయిన యుక్తవయస్సును మళ్లీ పొందాలనుకుంటా. నాలాంటి స్త్రీలకు స్వేచ్ఛగా బతకడాన్ని నేర్పిస్తా. నా పాటల్లో లవ్, రిలేషన్, రొమాన్స్‌తోపాటు కమిట్‌మెంట్ ఉంటుంది. కాబట్టి నా పర్సనల్ లైఫ్ గురించి మీరు ఏమనుకుంటున్నా హహ్ హహ్ అనుకుంటూనే ఉంటా’ అని చెప్పింది. చివరగా తన రాబోయే అల్బమ్స్ మరింత వైవిధ్యంగా ఉండబోతునట్లు కూడా వెల్లడించింది.

Read More: దటీజ్ మెగా డాటర్ అంటూ కామెంట్స్ చేస్తున్న నెటిజెన్స్.. ఎందుకో తెలుసా?

Next Story

Most Viewed