- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లతాజీకి ఆశా భోంస్లేకు తేడా తెలీదా? అతియా శెట్టిని దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
వార్తల్లో ఉండటానికి ఇంతకు దిరజారాలా? ఎవరు చనిపోయారో కూడా తెలుసుకోకుండా పోస్టులు పెడతావా? అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

దిశ, సినిమా: లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే మరణంతో దేశం మొత్తం విషాదంలో మునిగిపోయింది. ఏప్రిల్ 12న ఆమె కన్నుమూశారన్న వార్త తెలియగానే సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేశారు. అయితే, ఈ విషాద సమయంలో బాలీవుడ్ నటి, సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి చేసిన ఒక పొరపాటు సోషల్ మీడియాలో తీవ్ర దుమారానికి దారితీసింది. ఆశా భోంస్లే మరణానికి నివాళి అర్పిస్తూ, ఆమె ఫోటోకు బదులుగా దివంగత లతా మంగేష్కర్ ఫోటోను షేర్ చేయడమే ఈ వివాదానికి కారణం. 92 ఏళ్ల ఆశా భోంస్లే శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అతియా శెట్టి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో సంతాపం వ్యక్తం చేస్తూ ఓ ఫోటోను పెట్టింది. కానీ, అది ఆశా భోంస్లే ఫోటో కాదు.. 2022లో మరణించిన ఆమె సోదరి లతా మంగేష్కర్ పిక్.
ఈ చిన్న పొరపాటు నెటిజన్ల కంట పడటంతో అతియాపై విమర్శల వస్తున్నాయి. తను పెట్టిన తప్పును గ్రహించిన అతియా వెంటనే ఆ పోస్ట్‌ను డిలీట్ చేసినప్పటికీ, అప్పటికే స్క్రీన్ షాట్లు వైరల్ అయిపోయాయి. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అంతేకాకుండా ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. వార్తల్లో ఉండటానికి ఇంతకు దిరజారాలా? ఎవరు చనిపోయారో కూడా తెలుసుకోకుండా పోస్టులు పెడతావా? అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. టెక్నాలజీ అందుబాటులో ఉన్నా.. కనీసం గూగుల్ చేసి ఫోటోను చెక్ చేసుకోలేవా? నేటి తరం నెపో కిడ్స్‌కు అసలు తాము పనిచేస్తున్న పరిశ్రమ గురించి కనీస అవగాహన లేదు అంటూ ఘాటుగా విమర్శించారు. కేవలం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కనిపించడం కోసమే ఇలాంటి పోస్టులు పెడుతున్నారు కానీ, వారికి మరణించిన వ్యక్తిపై నిజమైన గౌరవం లేదని ఈ ఘటన నిరూపిస్తోంది అని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక యూజర్ అయితే "ఇది కేవలం పొరపాటు కాదు.. అజాగ్రత్తకు పరాకాష్ఠ" అని వ్యాఖ్యానించారు.
కాగా.. ఎనిమిది దశాబ్దాలకు పైగా తన పాటలతో భారతీయ సినిమాను ఉర్రూతలూగించిన ఆశా భోంస్లే ఎన్నో అవార్డులను అందుకున్నారు. ఆమె ఖాతాలో ఏడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో పాటు 'ఉమ్రావ్ జాన్', 'ఇజాజత్' చిత్రాలకు గానూ రెండు జాతీయ అవార్డులు ఉన్నాయి. అంతేకాకుండా గిన్నీస్ బుక్ రికార్డుల్లో కూడా నిలిచారు. భారత ప్రభుత్వం ఆమెను పద్మ విభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులతో గౌరవించింది. ఇక లోకాన్ని విడిచి అనంత లోకాలకు వెళ్లిన ఆశా భౌతిక కాయాన్ని అంతిమ దర్శనం కోసం ముంబైలోని ఆమె నివాసంలో ఉంచారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఒక మహోన్నత గాయని మరణించిన సమయంలో అతియా శెట్టి చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.






