Samantha: ఇప్పటికీ సమంత ఫోన్ వాల్‌ పేపర్ ఏంటో తెలుసా.. టైమ్‌తో సహా.. షాక్‌లో ఫ్యాన్స్?

by Kodari Anjali |   (  Updated:2025-02-14 02:48:54  IST  )

టాలీవుడ్ ముద్దుగుమ్మ, స్టార్ హీరోయిన్ బ్యూటీ సమంత(Samantha) గురించి పరిచయం అక్కర్లేదు.

Samantha: ఇప్పటికీ సమంత ఫోన్ వాల్‌ పేపర్ ఏంటో తెలుసా.. టైమ్‌తో సహా.. షాక్‌లో ఫ్యాన్స్?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ముద్దుగుమ్మ, స్టార్ హీరోయిన్ బ్యూటీ సమంత(Samantha) గురించి పరిచయం అక్కర్లేదు. కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్ అని చెప్పుకోవచ్చు. కేవలం కుర్రాళ్లకే కాదు.. ఈ బ్యూటీకి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఈ హీరోయిన్ సినిమాలు ఫ్లాప్ అయినా.. బ్లాక్ బస్టర్ హిట్ అయినా మాకు ఆల్ టైం హీరోయిన్ సమంతే అని చెప్పుకునే అభిమానులు కోట్లలో ఉన్నారు.

ఈ అందగత్తే.. వెరీ టాలెంటెడ్ నటి టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన మొదట్లోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ దక్కించుకుందనడంలో అతిశక్తిలేదు. కెరీర్ మొదట్లోనే అగ్ర హీరోల సరసన అవకాశాలు కొట్టేసి.. కోట్లాది మంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది. ఏ మాయ చేశావే సినిమాతో సినీ కెరీర్ ప్రారంభించిన సమంత.. తర్వాత వరుసగా అవకాశాలు దక్కించుకుని నెటిజన్ల మనసులో చెరగని ముద్ర వేసుకుంది.

తర్వాత బృందావనం(Brundavanam), దూకుడు, ఈగ, ఎటో వెళ్ళిపోయింది మనసు, ఎటో వెళ్ళిపోయింది మనసు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, జబర్దస్త్, సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌(Something Something), అత్తారింటికి దారేది, రామయ్యా వస్తావయ్యా, ఆటోనగర్ సూర్య(Autonagar Surya), మనం, రభస, అఆ,, 24, మహానటి, యూ టర్న్, సీమరాజా(Seemaraja), ఓ బేబీ, జాను, యశోద, కాతువాకుల రెండు కాదల్, శాకుంతలం(Sakunthalam), ఖుషి సినిమాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది. అంతేకాకుండా ఈ బ్యూటీ వెబ్ సిరీస్‌ల్లో కూడా రాణిస్తోంది. తనదైన సత్తా చాటుతోంది. సిటాడెల్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. సమంత సినిమాల విషయం పక్కన పెడితే..

సినీ సెలబ్రిటీల గురించి ఏ చిన్న విషయమైనా సోషల్ మీడియాలో సాధారణంగా వైరల్ అవ్వాల్సిందే. అలా తాజాగా ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత గురించి ఓ వార్త సోషల్ మీడియాలో ఆసక్తిని రేపుతోంది. సమంత ఓ ఫొటోలో తన మొబైల్ చేతిలో పట్టుకుని ఫొటోకు ఫోజులుచ్చింది. అయితే ఈ ఫొటో స్ట్కీన్ కాస్త కనిపించడంతో.. అందులో అందులో లింగభద్రదేవి ఫొటో ఉందని నెటిజన్లు కనిపెట్టి ఈ పిక్‌ను నెట్టింట వైరల్ చేస్తున్నారు.

అలాగే సామ్ పట్టుకున్న ఫోన్‌లో 11. 43 అని కూడా సమయం కనిపిస్తుంది. మరో చేతిలో సమంత పూల బోకె పట్టుకుని బ్లాక్ కలర్ డ్రెస్‌లో.. బ్లాక్ కలర్ కళ్లద్దాలు పెట్టుకుని గుడ్ లుక్‌లో ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తోంది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. గతం నుంచే సమంతకు దేవుళ్లపై భక్తి ఎక్కువ. అప్పటికి ఇప్పటికీ ఏం మారలేదు. సామ్‌ మొబైల్‌లో ఎప్పటినుంచో లింగభద్రదేవి ఫొటోనే అంటూ నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఈ నటి అందంపై పొగడ్తల వర్షం కురిపిస్తూ.. హెల్త్ బాగుండాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. మరికొంతమంది ఇంత భక్తేంట్రా అంటూ సామ్ వాల్ పేపర్ చూసి షాక్ అవుతున్నారు.

Next Story