మెగాస్టార్ ఇప్పటివరకు కూడబెట్టిన ఆస్తులు విలువ ఎంతో తెలుసా?

by Disha Web Desk 9 |
మెగాస్టార్ ఇప్పటివరకు కూడబెట్టిన ఆస్తులు విలువ ఎంతో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి పేరు ప్రఖ్యాతల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈయన ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. 1955 ఆగస్టు 22 వ తారీకున జన్మించిన చిరు 1978 నుంచి తనదైన నటనతో తెలుగు ఆడియన్స్‌ను అలరిస్తూనే ఉన్నారు. ఈ హీరో సినిమాలో ఏ మూలన అవకాశం వచ్చిన సరే ఎవ్వరూ వదులుకోరు. అంతలా క్రేజ్ సంపాదించుకున్నారు మెగాస్టార్. ఇంతటీ సక్సెస్ అందుకున్న చిరు ఎన్ని కోట్లు కూడబెట్టి ఉంటారోనని నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. కాగా.. సినిమాలు, పలు బ్రాండ్స్‌ను ప్రమోట్ చేస్తూ.. అంజనా ప్రొడక్షన్ హౌజ్ ద్వారా మెగాస్టార్ ఆస్తులు కూడబెట్టారని సమాచారం. హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో కోట్లాది రూపాయల విలువ చేసే బంగ్లా ఉంది.

అందులో సకల సౌకర్యాలు ఉండేలా నిర్మించుకున్నారు. దాని విలువ రూ.30 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇంతటి విలువ చేసే ఓ ఫామ్‌హౌస్ బెంగళూరులో కూడా ఉంది. ఇక లగ్జరీ కార్లు, అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ (రూ. 9-10.5 కోట్లు), రేంజ్ రోవర్ (రూ. 4 కోట్లు), రేంజ్ రోవర్ వోగ్ (సుమారు రూ. 2.2 కోట్లు), టయోటా ల్యాండ్ క్రూయిజర్ (రూ. 2 కోట్లు)తో పాటు ఆస్టన్ మార్టిన్ v8 వాన్టేజ్ కూడా ఉంది. అలాగే మెగాస్టార్ ఒక ప్రైవేట్ జెట్‌ కూడా కలిగి ఉన్నారు. ఇలా చిరంజీవి ఆస్తుల విలువ మొత్తం రూ. 1,650 కోట్లు ఉంటుందని జనాలు అంచనా వేస్తున్నారు. ఇక ఈ రోజు మెగాస్టార్ తన 68వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.

Read More : మీ అభిమానిగా గర్వపడుతున్నా అంటూ.. చిరుకు బర్త్ డే విషెస్ తెలిపిన గెటప్ శ్రీను


Next Story