‘రాజా సాబ్’ మూవీ కోసం ప్రభాస్ ఎంత పారితోషికం తీసుకున్నాడో తెలుసా..? అస్సలు ఊహించి ఉండలేరుగా..!

by Gugulothu.Kavitha |

‘రాజా సాబ్’ మూవీ కోసం ప్రభాస్ అన్ని కోట్ల పారితోషికం తీసుకున్నాడు.

‘రాజా సాబ్’ మూవీ కోసం ప్రభాస్ ఎంత పారితోషికం తీసుకున్నాడో తెలుసా..? అస్సలు ఊహించి ఉండలేరుగా..!
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), డైరెక్టర్ మారుతి(Maruti) కాంబోలో తెరకెక్కుతున్న సినిమా 'ది రాజా సాబ్'(The Raja Saab). ఇక ఇందులో నిధి అగర్వాల్(Nidhi Agarwal), రిద్ధి కుమార్(Riddhi Kumar), మాళవిక మోహనన్(Malavika Mohanan) హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్(Thaman) సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాను పూర్తి హారర్ కామెడీ జోనర్‌లో రూపొందించారు మేకర్స్. అయితే ఈ చిత్రం జనవరి 9న థియేటర్లలో రిలీజ్ కానుంది.

ఈ నేపథ్యంలో ప్రభాస్ ఈ మూవీ కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.150 కోట్ల వరకు పారితోషికం తీసుకునే స్థాయిలో ఉన్నప్పటికీ, ‘ది రాజా సాబ్’ కోసం ఆయన రూ.100 కోట్ల రెమ్యూనరేషన్‌కే పరిమితమయ్యారని టాక్ వినిపిస్తోంది. కథ, దర్శకుడు, సినిమా జోనర్ నచ్చడంతో ప్రభాస్ పారితోషికం తగ్గించుకోవడానికి ఒప్పుకున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story