రామ్ చరణ్, ఉపాసన బిడ్డ ‘బొడ్డు తాడు’ రక్తాన్ని ప్రిజర్వ్ చేయడానికి ఎంత ఖర్చయిందో తెలుసా?

by Dishanational2 |
రామ్ చరణ్, ఉపాసన బిడ్డ ‘బొడ్డు తాడు’ రక్తాన్ని ప్రిజర్వ్ చేయడానికి ఎంత ఖర్చయిందో తెలుసా?
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో రామ్‌ చరణ్ భార్య ఉపాసన జూన్ 20న పండంటి అడబిడ్డకు జన్మనిచింది. జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో ప్రసవం సాఫీగా జరిగిపోయింది. అయితే డెలివరీ‌కి ముందు పాప బొడ్డు తాడు రక్తాన్ని (అంబిలికల్ కార్డ్ బ్లడ్‌ను) ఓ ప్రైవేటు సంస్థ వద్ద భద్రపరుస్తున్నట్లు ఉపాసన ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఇలా ఇంతకు ముందు బాలీవుడ్ నటీమణులు కాజోల్, శిల్పా శెట్టితోపాటు మహేష్ బాబు దంపతులు కూడా అప్పట్లో తమ పిల్లల అంబిలికల్ కార్డ్‌ బ్లడ్‌ను ఇలానే భద్రపరిచారు. అయితే ఈ బొడ్డు తాడులోని రక్తాన్ని భద్రపరిచేందుకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకుందాం. సమాచారం ప్రకారం ఒక్కో సంస్థ ఒక్కో ధర నిర్ణయిస్తుంది. అలాగే ఇక్కడ మనం ఎన్ని సంవత్సరాలు భద్రపరచుకోవాలి అనుకుంటున్నామనే అంశంపై కూడా ఆధారపడి ఉంటుంది. 25 ఏళ్లు భద్రపరిచేందుకు స్టెమ్ సైట్ సంస్థ రూ. 55 వేలు తీసుకుంటున్నట్లు సమాచారం. కాగా ఉపాసన ఎన్ని సంవత్సరాలు భద్రపరిచిందో తెలియాల్సి ఉంది.

Also Read: ప్రెగ్నెన్సీ జర్నీలో లావెక్కుతున్న ఇలియానా.. ఫ్యాన్ ప్రశ్నకు అదిరిపోయే ఆన్సర్..

Next Story

Most Viewed