- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భార్యతో విడాకులు.. సింగర్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న స్టార్ హీరో.. తిట్టిపోస్తున్న నెటిజన్లు
కోలీవుడ్ స్టార్ హీరో రవి మోహన్ అలియాస్ జయం రవి(Jayam Ravi) అందరికీ సుపరిచితమే.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో రవి మోహన్ అలియాస్ జయం రవి(Jayam Ravi) అందరికీ సుపరిచితమే. తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ నటించిన ఆయన తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక కెరీర్ పిక్స్‌లో ఉండగానే ఆర్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే ఇటీవల ఆర్తి జయం రవి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు ఇస్తున్నట్లు ప్రకటన విడుదల చేసి అందరినీ షాక్‌కు గురి చేశాడు. ఇక ఈ విషయం తనకు తెలియదంటూ ఆర్తి పోస్ట్ పెట్టడంతో అసలు కథ మొదలైంది. ఇక అప్పటి నుంచి భార్యతో వివాదం, విడాకులతో జయంరవి హాట్ టాపిక్ అవుతున్నారు.
తరచూ భార్యపై ఆరోపణలు చేస్తూ పోస్టులు పెడుతున్నాడు. తన భార్యతో జీవించలేనని జయం రవి కోర్టును కోరగా.. ఆర్తి భరణం రూ. 50 చెల్లించాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతం వీరి విడాకులు కేసు కోర్టులో ఉంది. ఈ క్రమంలోనే జయం రవి, సింగర్ కెనిషా(Kenisha Francis)తో సహజీనవం చేస్తున్నట్లు పలు పుకార్లు షికారు చేశాయి. అంతేకాకుండా ఆర్తి సైతం అందుకే తనకు విడాకులు ఇస్తున్నట్లు ఆరోపణలు కూడా చేసింది.ఈనేపథ్యంలో వాటిని జయం రవి తాము ఫ్రెండ్స్ అని కొట్టిపారేసినప్పటికీ అప్పటినుంచి ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈక్రమంలో.. తాజాగా, జయంరవి సోమవారం కెన్నీషాతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు.
స్వామివారి దగ్గరకు వీరిద్దరు జంటగా వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు దారుణంగా తిడుతున్నారు. కెనిషాతో తిరగడానికే భార్య విడాకులిచ్చావా? అని ప్రశ్నిస్తున్నారు. అయితే జయం రవి ఇలా సడెన్‌గా తిరుమలకు వెళ్లడానికి కారణం ఏంటంటే.. ఆయన త్వరలో సొంతంగా ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీని ప్రారంభోత్సవం జరగబోతోంది. ఈ క్రమంలో తిరుమల స్వామి వారి ఆశీర్వాదాలు తీసుకున్నట్లు టాక్.






