కల్యాణ్ దేవ్‌తో విడాకులు.. అసలు నిజాలు బయటపెట్టిన మెగా డాటర్ శ్రీజ.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్!

by Disha Web Desk 6 |
కల్యాణ్ దేవ్‌తో విడాకులు.. అసలు నిజాలు బయటపెట్టిన మెగా డాటర్ శ్రీజ.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్!
X

దిశ, సినిమా: మెగా స్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ అందరికీ సుపరిచితమే. ఆమె మొదట ఓ వ్యక్తి ప్రేమించి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఓ కూతురు పుట్టాక విడాకులు తీసుకుని మళ్లీ చిరు చెంతకు చేరింది. దీంతో ఆమె బాధను చూడలేక మెగాస్టార్ కల్యాణ్ దేవ్‌‌తో శ్రీజకు పెళ్లి చేశాడు. వీరిద్దరికి ఓ పాప పుట్టింది. అంతా బాగుందని అనుకునే లోపు వారి మధ్య ఏవో మనస్పర్ధలు రావడం వల్ల విడాకులు తీసుకుని విడిపోయారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ కల్యాణ్ దేవ్ పలు పోస్టులతో హింట్ ఇస్తూ వచ్చాడు. అలాగే తన ఇద్దరు కూతుర్లతో కలిసి శ్రీజ కొద్ది రోజుల నుంచి మెగాస్టార్ ఇంట్లోనే ఉంటుంది. దీంతో అంతా వీరిద్దరి విడాకులు కన్ఫామ్ అని ఫిక్స్ అయ్యారు.

ప్రస్తుతం మెగా డాటర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూ పాల్గొన్న శ్రీజ పెళ్లి, విడాకులపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘ మెగా ఫ్యామిలీలో పుట్టినప్పటికీ ప్రస్తుతం ఒంటరిగానే బతుకుతున్నాను. నేను విడాకులు తీసుకున్నప్పుడు చాలా మంది చాలా మాటలు అన్నారు. నన్ను నా కుటుంబాన్ని బ్లేమ్ చేశారు. అది చూసి ఎంతో ఎడ్చాను.. మానసికంగా బాధపడ్డాను. ఎవరైనా పెళ్లి చేసుకునే ముందు ఒకరినొకరు తెలుసుకోవాలి. వాళ్లు మన ఇంట్లో అమ్మా, నాన్నలా ఉండరు కదా. అంత ప్రేమగా అస్సలు చూసుకోలేరు, మా చిరంజీవిగారికి నేనంటే ప్రాణం’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శ్రీజ కామెంట్స్ వైరల్ అవుతుండటంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

Next Story

Most Viewed