‘బిచ్చగాడు-2’ ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ..

by sudharani |
‘బిచ్చగాడు-2’ ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ..
X

దిశ, వెబ్‌డెస్క్: ‘బిచ్చగాడు’ 2016లో చిన్న సినిమాగా రిలీజై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా.. ఈ మూవీ సీక్వెల్ ‘బిచ్చగాడు-2’ కూడా థియేటర్లలో సందడి చేసింది. కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ.. మంచి కలెక్షన్లు సాధిస్తోంది. కాగా.. తాజాగా ఈ సినిమా ఓటీటీ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. తమిళం, తెలుగులో జూన్ మూడో వారం నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమా నిన్న (శుక్రవారం) విడుదల కాగా, మొదటిరోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.24 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

Also Read..

మగాళ్లను ఆడుకుంటున్న ఆడవాళ్లు.. ‘మెన్ టూ’ ట్రైలర్‌ను మీరూ చూసేయండి!!

Next Story

Most Viewed