- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పంజాబ్ సింగర్‌తో దిశా పటానీ డేటింగ్.. సంచలన వీడియో వైరల్
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ దిశా పటానీ(Disha Patani) తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్తూ తక్కువ సమయంలోనే భారీ క్రేజ్‌ను సంపాదించుకుంది.

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరోయిన్ దిశా పటానీ(Disha Patani) తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్తూ తక్కువ సమయంలోనే భారీ క్రేజ్‌ను సంపాదించుకుంది. గ్లామర్‌తో పాటు నటనలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న ఈ బ్యూటీ, గత ఏడాది విడుదలైన ‘కల్కి’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో రెండు ప్రాజెక్ట్‌లలో నటిస్తూ బిజీగా ఉన్న దిశా, సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోలు, వీడియోలతో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా.. తాజాగా, దిశా పటానీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
ఈ వీడియోలో ఆమె పంజాబ్‌కు చెందిన సింగర్ తల్‌విందర్‌తో కలిసి కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఓ ప్రైవేట్ పార్టీలో ఇద్దరూ చాలా క్లోజ్‌గా ఉన్నట్లు కనిపించడంతో, వీరిద్దరి మధ్య ఏదో ఉందన్న చర్చ మొదలైంది. దీంతో దిశా, తల్‌విందర్ (Talwinder)డేటింగ్ చేస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వేగంగా వ్యాపిస్తున్నాయి. ఆ వీడియోలో తల్‌విందర్ జర్కిన్ వేసుకుని, క్యాప్‌తో ముఖం పూర్తిగా కనిపించకుండా జాగ్రత్త పడిన తీరు మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ కారణంగా నెటిజన్లు రకరకాల అంచనాలు వేస్తూ కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఇది స్నేహం మాత్రమేనని అంటుండగా, మరికొందరు మాత్రం డేటింగ్ రూమర్స్‌కు ఇది క్లారిటీ ఇస్తోందని అభిప్రాయపడుతున్నారు.
Video Credit: Voompla (Instagram)






